ఒకప్పటితో పోలిస్తే తాజాగా ఓటిటి అనేది మన రోజువారి లైఫ్ లో భాగస్వామ్యం అయింది. కరోనా అనంతరం అందరూ ఎక్కువగా ఓటిటి కంటెంట్ వైపు చూస్తున్నారు. అందుకే పలు ఓటిటి మాధ్యమాలు ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ సిరీస్ లు, సినిమాలతో ఆడియన్స్ ముందుకి వస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన పలు సినిమాలు తాజాగా ఓటిటి ఆడియన్స్ ముందుకి రానున్నాయి.
కాగా ఈ వారాంతంలో ఓటిటి ఆడియన్స్ ముందుకి రానున్న వాటిలో బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించిన మార్కో, బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ బేబీ జాన్ తో పాటు మరికొన్ని సినిమాలు ఉన్నాయి.
కాగా డాకు మహారాజ్, మార్కో ఓటిటి కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసారు. ఈటివి విన్ లో ప్రసారం కానున్న తెలుగు వెబ్ సిరీస్ సమ్మేళనం. ఈ సిరీస్ లో ఇందులో ప్రియా వడ్లమాని, గానాదిత్య, వినయ్ అభిషేక్, శ్రీకాంత్ గుర్రం, నూతక్కి బిందు భార్గవి, జీవన్‌ప్రియ రెడ్డి మరియు శివంత్ యాచమనేని కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలానే బాలా, అరుణ్ విజయ్‌ల వనగన్ కూడా స్ట్రీమింగ్ కి సిద్దమయ్యాయి
నెట్‌ఫ్లిక్స్:
డాకు మహారాజ్ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ)
స్ట్రేస్ (ఇంగ్లీష్)
ఆహా వీడియో
మార్కో (తెలుగు)
బాటిల్ రాధ (తెలుగు)
జియో హాట్‌స్టార్:
కౌశల్ జీ వర్సెస్. కౌశల్ (హిందీ)
అమెజాన్ ప్రైమ్ వీడియో:
బేబీ జాన్ (హిందీ)
వనగన్ (తమిళం)
ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌లు
సమ్మేళనం (తెలుగు) – ఈటివి విన్
కథా కమామిషు (తెలుగు) – సన్ నెక్స్ట్