Homeసినిమా వార్తలునాలుగోసారి రిపీట్ అవనున్న బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ?

నాలుగోసారి రిపీట్ అవనున్న బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ?

- Advertisement -

పుష్ప ది రైజ్ సినిమాతో ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న అల్లు అర్జున్ తదుపరి సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. పుష్ప సినిమా తర్వాత దర్శకుడు వేణు శ్రీరామ్ తో ఐకాన్ సినిమా చేస్తారు అని వార్తలు వచ్చినా.. కోన్ని కారణాల వల్ల ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇక దర్శకుడు కొరటాల శివతో ఒక సినిమా ప్రకటించినా, అది కూడా కార్యరూపం దాల్చలేదు.

అయితే ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ ల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో మరొక సినిమాని ప్లాన్ చేస్తున్నారన్న వార్త విన్న తరువాత అల్లు అర్జున్ అభిమానులు ఇది నిజంగా జరిగితే ఎంతో బాగుండు అని ఆశతో ఉన్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ దృష్టి మొత్తం పుష్ప2 పైనే ఉంది. ఈ ఐకాన్ స్టార్ ఇంతకు ముందు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో పరాజయంలో ఉన్నప్పుడు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలా వైకుంఠపురం సినిమా భారీ విజయాన్ని సాధించింది.. అల్లు అర్జున్ తో పాటు త్రివిక్రమ్ కు కూడా ఎంతో గొప్ప స్థాయిని, పేరుని తీసుకొచ్చింది. వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా కోసం అటు అల్లు అర్జున్ అభిమానులతో పాటు త్రివిక్రమ్ సినిమాలని, తూటాల్లాంటి మాటలను ఇష్టపడే సినీ ప్రేమికులు కూడా ఎదురు చూస్తున్నారు.

READ  Box-Office: రెండవ వారంలోనూ అదరగొడుతున్న కార్తీకేయ-2

తాజాగా త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది. నిజానికి ఈ సినిమాను ఎన్టీఆర్ హీరోగా చేయాల్సింది. అలాగే సినిమాకు “అయినను పోయి రావలే హస్తినకు” అనే టైటిల్ కూడా కొన్ని రోజులు ప్రచారంలో ఉండటం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేతులు మారి మహేష్ బాబు వద్దకు వెళ్ళింది.

ఇక మహేష్ తో సినిమా చేసిన తర్వాత త్రివిక్రమ్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఒక సినిమా ఉండొచ్చు అని ఆ మధ్య వార్తలు వచ్చాయి.. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా చేయనున్నారనే వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఏది ఏమైనా పుష్ప సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి భారీ కలెక్షన్లతో పాటు ప్యాన్ ఇండియా స్థాయిలో మంచి ఇమేజ్ ను కూడా తీసుకొచ్చారు హీరో అల్లు అర్జున్.. అలాగే అలా వైకుంఠపురములో సినిమాతో అందరినీ ఆకట్టుకున్నారు త్రివిక్రమ్. వీరిద్దరూ ప్రస్తుతం వారు చేస్తున్న సినిమాల చిత్రీకరణ పూర్తయిన తర్వాత తమ కలయికలో ముచ్చటగా మూడో సినిమా చేయనున్నారని సమాచారం.

READ  ప్రభాస్ పనితీరు మెచ్చని ప్రశాంత్ నీల్

త్రివిక్రమ్‌ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఇప్పటి వరకు జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories