అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన పుష్ప 2 కోసం నటి సాయి పల్లవిని ఒక పాత్ర కోసం తీసుకున్నారని నిన్నటి నుంచి కొన్ని వెబ్ సైట్లు, సోషల్ మీడియా మరియు సినీ సంబంధిత మీడియా సర్కిల్స్ లో అనేక రకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి. క్షణాల్లోనే ఈ వార్త వైరల్ కావడంతో నెటిజన్లు ఈ వార్త విని చాలా ఎగ్జైట్ అయ్యారు.
కాగా సాయి పల్లవి సెట్స్ లో జాయిన్ కూడా అయినట్లు కొన్ని వార్తలు వచ్చాయి కానీ ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. పుష్ప 2 టీం ఇంకా సాయి పల్లవితో చర్చలు జరుపుతోందని, ఇంకా తుది నిర్ణయం ఏంటి అనేది బయటకి రాలేదని సమాచారం. కాగా ‘పుష్ప – ది రూల్’ లోని పాత్ర యొక్క షూటింగ్ కోసం సాయి పల్లవి 10 రోజులు కేటాయించారని కూడా వార్తలు వచ్చాయి.
ఈ సినిమాలో ఆమె గిరిజన యువతిగా నటించనున్నారని సమాచారం వచ్చింది. పుష్ప 2 లో ఆమె నటిస్తుందనే వార్త హైప్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది.అల్లు అర్జున్ తో కలిసి సాయి పల్లవి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనే వార్త విని సాయి పల్లవి అభిమానులు సోషల్ మీడియాలో తెగ సంబరపడిపోయారు. కానీ ఇంకా అధికారికంగా ఏ విషయం ఖరారు కాలేదు.
ఏదేమైనా పుష్ప 2 చూసేందుకు అందరూ ఆసక్తిగా ఉన్నారు. కాగా ఈ చిత్రంలో కథ హద్దులు దాటి ఇంటర్నేషనల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటుంది. రష్మిక మందన శ్రీ వల్లిగా, ఫాహద్ ఫాజిల్ పుష్ప 2లో భన్వర్ సింగ్ షెకావత్ గా తొలి భాగంలోని పాత్రలలోనే కనిపించనున్నారు. కాగా ఫాహద్ పాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తుందని అంటున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలో ఒక ముఖ్య పాత్ర కోసం జగపతిబాబును కూడా తీసుకున్నారు.