Homeసినిమా వార్తలుTammareddy Bharadwaj: ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఆస్కార్ క్యాంపెయిన్ కోసం 80 కోట్లు ఖర్చు...

Tammareddy Bharadwaj: ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఆస్కార్ క్యాంపెయిన్ కోసం 80 కోట్లు ఖర్చు చేసిందని తెలిపిన దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ

- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా గురించి సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ టీం కోసం ఫ్లైట్ టికెట్స్ ఖర్చుతో 8 సినిమాలు తీయొచ్చని ఆయన అన్నారు. తమ్మారెడ్డి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి సినీ ప్రేమికులంతా చర్చించుకుంటున్నారు. ఒక తెలుగు సినిమా ఆస్కార్‌కి అడుగు దూరంలో నిలిచింది. మార్చి 12న ఒక‌వేళ నిజంగా నాటు నాటు పాటకి ఆస్కార్ వ‌స్తే మాత్రం తెలుగు ప్రేక్షకులందరూ గ‌ర్వ‌ప‌డతారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ తీవ్ర వ్యాఖ్య‌లు చేయడం మాత్రం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

ర‌వీంద్ర భార‌తిలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ పాల్గొన్నారు. సినిమా మేకింగ్ అనేది ఎలా మారింద‌నే ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఆయ‌న మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్ సినిమా పై ఆయన తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ‘‘ఆస్కార్ ప్ర‌మోష‌న్స్ కోసం ఆర్ ఆర్ ఆర్ టీమ్ 80 కోట్లు ఖర్చు చేశారు. ఆ 80 కోట్లు మాకు ఇస్తే ఓ 10 సినిమాలు తీసి వాళ్ళ మొఖాన కొడతాం’’ అన్నారు. ఆయ‌న మాటలలో ఆర్ఆర్ఆర్‌ను కించప‌ర‌చాల‌నే ఉద్దేశం కనిపించడంతో ఆర్ ఆర్ ఆర్ సినిమా అభిమానులు మరియు నెటిజన్లు తమ్మారెడ్డి భరద్వాజ పై మండి పడ్డారు.

READ  RRR NTR: చిరంజీవి తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ - ఆర్ ఆర్ ఆర్ ట్వీట్‌లో ఎన్టీఆర్‌ని పట్టించుకొని పవన్

ఆస్కార్ కోసం ఇంత ఖ‌ర్చు పెట్టారు, అంత ఖర్చు పెట్టాన‌ర‌టం క‌రెక్ట్ కాద‌ని నెటిజ‌న్స్ కొంద‌రు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. తమ్మారెడ్డి అనుకున్నంత సులువుగా ఆస్కార్ ప్రమోషన్స్ జరగవని, ఇంతటి ఉన్నత స్థాయి గుర్తింపు రావాలంటే కచ్చితంగా పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతాయని వారు అన్నారు. ఈ సమయంలో ఆర్ఆర్ఆర్ గురించి చెడుగా మాట్లాడటం మానుకోవాలని కూడా కొందరు పేర్కొన్నారు.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 2023 ఆస్కార్ అవార్డుకు ‘ఆర్ఆర్ఆర్’ నాటు నాటు పాట నామినేట్ అయింది. అంతే కాకుండా ఈ పాటను గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ వేదిక పై లైవ్ లో ప్రదర్శించనున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఈ స్థాయిలో పేరు తెచ్చుకోవడం చూసి తెలుగు సినీ ప్రేమికులు గర్వంగా ఫీలవుతున్నారు. మార్చి 12న లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ లతో పాటు ఆర్ఆర్ఆర్ టీం మొత్తం ఈ గ్రాండ్ నైట్ కు హాజరు కానున్నారు.

READ  NTR: ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం USA వెళ్లిన ఎన్టీఆర్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories