Homeసినిమా వార్తలుPushpa 2: అన్ని అనుమానాలను తొలగించిన పుష్ప 2 హిందీ గ్లింప్స్ కు వచ్చిన రెస్పాన్స్

Pushpa 2: అన్ని అనుమానాలను తొలగించిన పుష్ప 2 హిందీ గ్లింప్స్ కు వచ్చిన రెస్పాన్స్

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా అద్భుతంగా ఆడింది. కరోనా కాలంలో విడుదలైన ఈ సినిమా.. ఆ సమయంలో ఇతర హిందీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా పుష్ప ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి కేవలం హిందీలోనే 100 కోట్లకు పైగా వసూలు చేసింది.

కాబట్టి పుష్ప హిందీలో భారీ బ్లాక్ బస్టర్ కావడంతో ఆ సినిమా యొక్క రెండో భాగం పై అంచనాలు పెరిగాయి. బాహుబలి 2, కేజీఎఫ్ 2 తరహాలో పుష్ప 2 కూడా రికార్డ్ కలెక్షన్లు సాధిస్తుందని చాలా మంది ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాల వారు ఆశించారు. అయితే దీని పై కొన్ని వర్గాల ప్రజల్లో మాత్రం అనుమానాలు వ్యక్తమయ్యాయి.

కేజీఎఫ్ 2, బాహుబలి 2 తరహాలో పుష్ప 2 భారీ బజ్ క్రియేట్ చేయలేకపోతుందని, దీని సీక్వెల్ కు ఆసక్తి కలిగించే కథాంశం లేదని కొన్ని ప్రేక్షక వర్గాలు, ట్రేడ్ వర్గాలు భావించాయి. ఒక రకంగా చెప్పాలంటే బాహుబలి, కేజీఎఫ్ రెండు సినిమాల ఫస్ట్ పార్ట్ చాలా పై స్థాయిలో ముగియగా.. పుష్ప ఫస్ట్ పార్ట్ లో అంత ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ లేదు అనే మాట నిజం అని కొంతమంది అన్నారు.

READ  Pushpa 2: కొనసాగింపుగా కాక కొత్త సినిమా లాంటి అనుభూతిని ఇచ్చిన పుష్ప 2 గ్లింప్స్

అయితే ఇటీవలే విడుదలైన రిలీజైన పుష్ప 2 గ్లింప్స్ కి వచ్చిన రెస్పాన్స్ అన్ని అనుమానాలను నివృత్తి చేసింది. వేర్ ఈజ్ పుష్ప హిందీ గ్లింప్స్ కు ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది,యూట్యూబ్ లో ఈ గ్లింప్స్ ఏకంగా 60 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇది సినిమా పై హిందీ ప్రేక్షకుల అంచనాలను ధృవీకరిస్తుంది. మరి ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Follow on Google News Follow on Whatsapp

READ  Das Ka Dhamki: నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాగానే ప్రదర్శింపబడుతున్న దాస్ కా ధమ్కీ


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories