పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ది రాజా సాబ్. మాళవిక మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా కొన్నాళ్లుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇప్పటికే ఆల్మోస్ట్ చివరిదశకు షూటింగ్ చేరుకునే ఈ సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై వివేక్ కూచిభొట్ల, టీజీ విశ్వప్రసాద్ దీనిని గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే ఈ సినిమాకు యొక్క టీజర్ రిలీజ్ కి సంబంధించి తాజాగా నిర్మాత ఎస్ కే ఎన్ మాట్లాడుతూ మరొక రెండు వారాల్లో ది రాజాసాబ్ టీజర్ ఆడియన్స్ ముందుకు రానుందని ఆపైన సినిమాకు సంబంధించి ఒక్కొక్కటిగా అప్డేట్స్ వస్తాయని చెప్పారు.
మరోవైపు దర్శకుడు మారుతి సహా ది రాజాసాబ్ టీం మొత్తం కూడా దీనిని ఎంతో క్వాలిటీగా అత్యద్భుతంగా అందించేందుకు సిద్ధమవుతుందని తప్పకుండా మూవీ చాలా పెద్ద విజయం అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.