Homeసినిమా వార్తలుPrabhas: ప్రభాస్ సినిమా పై వస్తున్న పుకార్లను కొట్టిపారేసిన ప్రొడక్షన్ టీమ్

Prabhas: ప్రభాస్ సినిమా పై వస్తున్న పుకార్లను కొట్టిపారేసిన ప్రొడక్షన్ టీమ్

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ మరియు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా కోసం ఇటివలే “పుష్ప” వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు సుకుమార్‌తో చేతులు కలపనున్నట్లు నిన్నటి నుంచి కొత్తగా కొన్ని పుకార్లు రావడం మొదలయ్యాయి.

సుకుమార్ ఇప్పటికే పుష్ప 2తో బిజీగా ఉన్నారు. ఇక ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కూడా మరో సినిమా కూడా చేయబోతున్నట్లు కూడా తెలిసింది. ఇక ప్రభాస్ కూడా సాలార్, ప్రాజెక్ట్ కె, రాజా డీలక్స్ మరియు స్పిరిట్ వంటి సినిమాలతో వచ్చే రెండేళ్లు చాలా రెస్ట్‌లెస్‌గా ఉన్నారు. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఈ హీరో – దర్శకులు ఇద్దరూ జతకట్టనున్నారని వార్తలు వచ్చాయి.

ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ హై-బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌ను నిర్మించబోతున్నారని కూడా నివేదించబడింది. అయితే ఈ వార్తలలో నిజం లేదని, ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని నిర్మాత పేర్కొన్నారు.

READ  NTR30: తీవ్ర ఒత్తిడిలో ఎన్టీఆర్ మరియు కొరటాల శివ

తమ అభిమాన హీరో సుకుమార్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ తో వర్క్ చేస్తారన్న వార్త విన్న ప్రభాస్ ఫ్యాన్స్ మరింత ఖుషీ అయ్యారు. కానీ అలాంటిదేమీ జరగడం లేదని నిర్మాత అభిషేక్ స్పష్టం చేశారు. ఇంకా ఏదైనా హైప్రొఫైల్ ప్రాజెక్ట్ గురించి ప్రకటన వస్తే, నేరుగా తమ నుండి ప్రకటన వస్తుందని నిర్మాత ధృవీకరించారు.

ది కాశ్మీర్ ఫైల్స్ మరియు కార్తికేయ 2 వంటి చిత్రాలను నిర్మించిన తర్వాత, అభిషేక్ అగర్వాల్ ఫిల్మ్ సర్కిల్స్‌లో బాగా ప్రసిద్ధి చెందారు. కాగా రాబోయే రోజుల్లో వారు మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలని నిర్మించే అవకాశం ఉంది. మరి ఎలాంటి ప్రాజెక్ట్స్ తో వారు ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.

READ  వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల విడుదల తేదీలను డిస్ట్రిబ్యూటర్లకు తెలియజేసిన మైత్రీ మూవీస్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories