Homeసినిమా వార్తలుPonniyin Selvan 2: పొన్నియిన్ సెల్వన్ 2 విషయంలో తీవ్ర నిరాశకు గురవుతున్న నిర్మాతలు

Ponniyin Selvan 2: పొన్నియిన్ సెల్వన్ 2 విషయంలో తీవ్ర నిరాశకు గురవుతున్న నిర్మాతలు

- Advertisement -

సాధారణంగా ఒక సినిమా మొదటి భాగం పెద్ద హిట్ అయితే సహజంగానే రెండో భాగానికి భారీ బజ్ ఉంటుంది. బాహుబలి, కేజీఎఫ్ సిరీస్ విషయంలో ఇదే జరిగిన విషయం తెలిసిందే. ఆ సినిమాల సీక్వెల్స్ కోసం దేశం మొత్తం ఎదురుచూసింది. ఇక దక్షిణ భారత సినీ పరిశ్రమ నుంచి రాబోయే మరో సీక్వెల్ పుష్ప 2 కూడా భారీ బజ్ తో దూసుకెళ్తోంది. అయితే మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ విషయంలో మాత్రం అదే స్థాయి ఆసక్తి ఉందని చెప్పలేం.

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ 1 తమిళ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేయగా, ఇతర భాషల్లో మాత్రం ఓకే అనిపించుకుంది. ఇప్పుడు రెండో భాగానికి కూడా ఇతర భాషల్లో జీరో బజ్ ఉంది.

అంతే కాకుండా తమిళ భాషలో కూడా ఈ మధ్యే ఓపెన్ అయిన ఓవర్సీస్ బుకింగ్స్ అంత భారీగా ఏమీ లేవు. సెన్సేషనల్ గా మొదలైన బుకింగ్స్ ఇప్పుడు పార్ట్ 1 కంటే తక్కువగా ట్రెండ్ అవుతుండటం నిర్మాతలకు నిరాశ కలిగించే విషయమే. ఓవర్సీస్ బుకింగ్స్ ఇదే ట్రెండ్ లో కొనసాగితే తమిళనాడులో కూడా ఇదే ట్రెండ్ ను ఆశించవచ్చు. ఇప్పుడు ఈ సినిమా పీఎస్ 1 రికార్డులను బద్దలు కొడుతుందా లేదా అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

READ  Dasara: అదిరిపోయేలా ఉన్న దసరా ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్

ఇదిలా ఉంటే పొన్నియిన్ సెల్వన్ 2 యూనిట్ ఈ సినిమా పై వీలయినంత బజ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ సినిమా తెలుగు వర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు అంటే ఏప్రిల్ 23 సాయంత్రం 5:30 గంటలకు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Ponniyin Selvan 2: పొన్నియిన్ సెల్వన్ 2 ఫస్ట్ పార్ట్ కలెక్షన్లను బ్రేక్ చేస్తుందా?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories