Homeసినిమా వార్తలుAgent: ఏజెంట్ సినిమాకి ముందు అనుకున్న బడ్జెట్ మరియు వాస్తవ బడ్జెట్ లను వెల్లడించిన...

Agent: ఏజెంట్ సినిమాకి ముందు అనుకున్న బడ్జెట్ మరియు వాస్తవ బడ్జెట్ లను వెల్లడించిన నిర్మాత

- Advertisement -

అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ ఏజెంట్ ఈ నెల 28న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనిల్ సుంకర పలు ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమా కథ, బడ్జెట్ తదితర అంశాల పై ఆసక్తికర విషయాలు చెప్పారు.సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ వినమని అఖిల్ తనకు సూచించాడని అనిల్ సుంకర వెల్లడించారు.

ఏజెంట్ ను మొదట 45 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేశామని, అయితే కరోనా మరియు ఇతర కారణాల వల్ల అనుకున్న బడ్జెట్ కంటే రెట్టింపు బడ్జెట్ పెరిగిందని, ఇప్పుడు 80 కోట్లకు పైగా బడ్జెట్ అయిందని, అయితే ఈ సినిమా బిజినెస్ పట్ల తాము సంతోషంగా ఉన్నామని ఆయన అన్నారు.

వక్కంతం వంశీ ఏజెంట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు సినిమాకు సంబంధించిన ప్రతి విషయం గురించి ఓపెన్ డిస్కషన్ జరిగిందని అనిల్ సుంకర తెలిపారు. హృతిక్ రోషన్ ను పోలిన వ్యక్తి ఈ చిత్రానికి అవసరమని, ఆ హార్డ్ వర్క్ కూడా చేసే మనిషి కావాల్సి వచ్చిందని అందుకే అఖిల్ ను ఎంచుకున్నామని ఆయన అన్నారు. ఆ సమయంలోనే అఖిల్, సురేందర్ రెడ్డి మధ్య పరిచయం ఏర్పడిందట. అంతే కాకుండా అఖిల్ శారీరకంగా ఫిట్ గా ఉండడమే కాకుండా సినిమా కోసం, ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ ల కోసం చాలా కష్టపడ్డారని కూడా చెప్పారు.

READ  Rana Naidu: రానా నాయుడు వెబ్ సిరీస్ చూసేవారికి స్ట్రాంగ్ వార్నింగ్ - ఫ్యామిలీతో కలిసి చూడొద్దు

ఏజెంట్ సినిమాను ఇండియాతో పాటు విదేశాల్లోని పలు లొకేషన్స్ లో షూట్ చేసినట్లు నిర్మాత తెలిపారు. ఈ సినిమా షూటింగ్ 2021 ఏప్రిల్లో ప్రారంభమైంది. హైదరాబాద్, మనాలీ, వైజాగ్, ముంబై, కొచ్చి, బుడాపెస్ట్, మస్కట్ ప్రాంతాల్లో సినిమా షూట్ చేశాం” అని ఆయన అన్నారు.

త్వరలోనే ఈ చిత్రంలోని మెయిన్ సాంగ్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు నిర్మాత వెల్లడించారు. భీమ్స్ ఈ మాస్ సాంగ్ ను కంపోజ్ చేశాడని, అఖిల్ అద్భుతమైన డాన్స్ లు ఈ పాటలో ఉంటాయని అన్నారు. అంతే కాకుండా ఏజెంట్ సినిమా రన్ టైం కూడా లాక్ చేయబడింది. సినిమా నిడివి 2:30 గంటలు కాగా.. ఫస్ట్ హాఫ్ 1:15 గంటలు, సెకండాఫ్ కూడా అదే రన్ టైమ్ ఉంటుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  Dasara: నైజాం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోన్న దసరా


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories