వీరసింహారెడ్డి ఓవర్సీస్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. అది యుఎస్ఎ కావచ్చు లేదా యుకె, ఆస్ట్రేలియాలలో ఎక్కడ చూసినా వీరసింహా రెడ్డి బుకింగ్స్ సూపర్ స్ట్రాంగ్ నోట్ లో ఉన్నాయి మరియు ఈ చిత్రానికి ఓవర్సీస్ లో ఈ రేంజ్ లో బుకింగ్స్ వస్తాయని ఎవరూ ఊహించలేదు కాబట్టి నందమూరి అభిమానులు కూడా ఈ బుకింగ్ లతో షాక్ అవుతున్నారు.
ఓవర్సీస్ లో ప్రతి ప్రాంతంలో తన పోటీదారు అయిన వాల్తేరు వీరయ్య బుకింగ్స్ పై ఈ చిత్రం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే వీరసింహారెడ్డి ఓవర్సీస్ లో మిలియన్ డాలర్లతో ఓపెనింగ్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
బాలయ్య గతంలో నటించిన యాక్షన్ సినిమాలు ఓవర్ సీస్ వద్ద తక్కువ ప్రభావం చూపేవి కానీ లెజెండ్ సినిమా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా కూడా ఓవర్సీస్ లో సంచలన స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో ‘వీరసింహారెడ్డి’ ఓవర్సీస్ లో విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది.
ఈ సినిమా నార్త్ అమెరికా హక్కులను శ్లోకా ఎంటర్ టైన్ మెంట్స్ దక్కించుకుంది. శ్లోకా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ‘వీరసింహారెడ్డి’ చిత్రానికి చక్కని పబ్లిసిటీ చేస్తున్నారు అందుకు ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది.
జనవరి 11న వీరసింహారెడ్డి ప్రీమియర్ షోలు ప్రదర్శింపబడతాయి. ఇక ఇప్పటి దాకా జరిగిన ప్రీ-బుకింగ్స్ చూసుకుంటే వీరసింహారెడ్డి 150 వేల డాలర్లు దాటింది.
సెన్సార్ షో ద్వారా పాజిటివ్ ఇన్ సైడ్ రిపోర్ట్స్, అద్భుతమైన బుకింగ్స్, అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ క్రేజ్, వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ అయెందుకు ఇలా అన్ని అంశాలు బాగా కలిసి వస్తున్నాయి. మరి ఈ అంచనాలను సినిమా ఎంతవరకు రీచ్ అవుతుందో వేచి చూడాలి.