Homeసినిమా వార్తలుసెప్టెంబర్ 23వ తేదీకి వాయిదా పడిన జాతీయ సినిమా దినోత్సవం

సెప్టెంబర్ 23వ తేదీకి వాయిదా పడిన జాతీయ సినిమా దినోత్సవం

- Advertisement -

మల్టీప్లెక్స్‌లో సినిమా చూసి ఆనందించాలి అని చాలా మంది ప్రేక్షకులకు కోరికగా ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఉన్న సినిమా టికెట్ రేట్లకు భయపడి మల్టీప్లెక్స్ అంటేనే ప్రేక్షకులు రావడానికి ధైర్యం చేయడం లేదు. ముఖ్యంగా కరోనా తరువాత టికెట్ రేట్లను అమాంతం పెంచేయడంతో ప్రేక్షకులు మరింత దూరమయ్యారు. అయితే అలాంటి వారందరికీ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(MIA) ఇటీవలే ఒక శుభవార్త అందించింది. నేషనల్ సినిమా డే(National Cinema Day) అయిన సెప్టెంబర్ 16న దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్‌లలో ప్రేక్షకులు సినిమా చూసేందుకు వీలును కలిపిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.

ఈ మేరకు సెప్టెంబర్ 16న మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్ రేటును రూ.75కే అందించాలని MIA నిర్ణయించింది. ఈ క్రమంలోనే దేశంలోని అన్ని నగరాలలో ఉన్న పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ వంటి మల్టీప్లెక్స్ థియేటర్లలో ఈ డిస్కౌంట్ రేటును అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలిపారు. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) థియేటర్ వ్యాపారాన్ని నిలబెట్టిన సినీ ప్రేక్షకులకు కృతజ్ఞతగా ఈ ఆఫర్ ప్రకటించటంతో అందరూ ఎంతో ఆనందించారు.

ఏదేమైనా మల్టీప్లెక్స్‌లకు ఎక్కవ ప్రాధాన్యతనిచ్చే నేటి యువతరానికి ఇది ఖచ్చితంగా మంచి వార్తేనని అందరూ భావించారు అని చెప్పాలి. అయితే తక్కువ ధరకే సినిమాని చూడగలం అనే ప్రేక్షకుల ఆనందాన్ని దూరం చేస్తూ మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యం వారు తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తాజాగా అందించిన సమాచారం.

READ  బాలీవుడ్ హీరో రణ్ బీర్ నోట.. తెలుగు మాట

తక్కువ టికెట్ రేట్ల వల్ల వ్యాపారానికి ఏమాత్రం అనుకూలించని పరిస్థితులు వస్తాయని డిస్ట్రిబ్యూటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అందుకే మళ్ళీ టికెట్లు విషయంలో సరికొత్త ట్విస్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

తగ్గించిన ధరల వల్ల ఒకరోజు వచ్చే ఆదాయం పైన ప్రభావం చూపినా కూడా చాలా వరకు నష్టాలు చూడాల్సి వస్తుంది అని.. అందుకే ఈ ఈనెల సెప్టెంబర్ 16వ తేదీన ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్న రోజున కాకుండా 23వ తేదీన జాతీయ సినిమా దినోత్సవ కానుకగా మల్టీప్లెక్స్ లలో 75 రూపాయల టికెట్ల ధరకు అమ్మనున్నారు. ఈ మేరకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MIA) అధికారిక ప్రకటన చేసింది.

అసోసియేషన్ చేసిన ప్రకటనలో, భారతదేశం అంతటా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) మరియు సినిమాస్, జాతీయ సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని ₹75 సెలబ్రేటరీ అడ్మిషన్ ధరతో సినిమాల్లో ఒక రోజు గడపాలని సినీ ప్రేక్షకులను స్వాగతిస్తున్నాయి. జాతీయ సినిమా దినోత్సవాన్ని గతంలోనే ప్రకటించారు. అయితే, వివిధ ‘స్టేక్ హోల్డర్‌ల’ అభ్యర్థన మేరకు మరియు ప్రేక్షకుల భాగస్వామ్యాన్ని మరింత పెంచడానికి, జాతీయ సినిమా దినోత్సవం సెప్టెంబర్ 23న నిర్వహించబడుతుందని తెలిపింది.

PVR, INOX, Cinepolis, Carnival, MIRA, Citypride, ASIAN, Mukta A2, Movie Time, Wave, M2K మరియు Delite సహా 4000 కంటే ఎక్కువ స్క్రీన్‌లు ఈ వేడుకలో పాల్గొంటున్నాయని ప్రకటన పేర్కొంది.

READ  బింబిసార-2 లో ఎన్టీఆర్ లేడు - కళ్యాణ్ రామ్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories