Homeసినిమా వార్తలుIratta: మలయాళంలో ఘనవిజయం సాధించి ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఇరాట్టా

Iratta: మలయాళంలో ఘనవిజయం సాధించి ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఇరాట్టా

- Advertisement -

నెట్ ఫ్లిక్స్ లో గత వారం నుంచి స్ట్రీమింగ్ అవుతున్న మలయాళ చిత్రం ఇరాట్టాకు ప్రేక్షకులు మరియు విమర్శకుల నుంచి భారీ ప్రశంసలు, లభించాయి. ఇతర భాషా ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ తో నెట్ ఫ్లిక్స్ ఈ రోజు నుంచి తెలుగు, తమిళం, కన్నడ వంటి ఇతర భాషల్లో ఈ చిత్రాన్ని ప్రసారం చేస్తోంది.

క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సైకలాజికల్ డ్రామా యాంగిల్ కూడా ఉంది. జోజు జార్జ్, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన ఇరాట్టా 2023 ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగా ఆడలేదు, కానీ ఇది విమర్శకుల నుండి మంచి సమీక్షలను అందుకుంది, మరియు ప్రధాన నటుడు జోజు జార్జ్ తన అద్భుతమైన నటనకు భారీగా ప్రశంసలు పొందారు.

ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రానికి అన్ని భాషల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా క్లైమాక్స్ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.ఈ సినిమా చూసిన నెటిజన్లు క్లైమాక్స్ ఇబ్బందిగా మరియు దిగ్భ్రాంతి చెందేలా ఉందని అభిప్రాయపడ్డారు.

READ  Selfiee: బాలీవుడ్‌కు షాకిచ్చిన అక్షయ్ కుమార్ సెల్ఫీ ఓపెనింగ్

అలాగే ఒక వర్గం ప్రేక్షకులకి ఈ సినిమా యొక్క క్లైమాక్స్ ఏమాత్రం నచ్చకపోగా తెలుగులో తీస్తే ఈ సినిమాకు ఇంత మంచి స్పందన వచ్చేది కాదని అంటున్నారు. రోహిత్ ఎం.జి.కృష్ణన్ దర్శకత్వం వహించిన ఇరాట్టా చిత్రం వాగమన్ పోలీస్ స్టేషన్ లో ఒక పోలీసు అధికారి హత్య మరియు ఆ తరువాత జరిగే దర్యాప్తు చుట్టూ తిరుగుతుంది.

నేరం పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరగడంతో దర్యాప్తు చేసి నిజానిజాలు వెలికితీయాలని పోలీసుల పై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఇంతకీ ఆ హంతకుడు ఎవరు? పోలీస్ స్టేషన్ లోనే నేరం ఎందుకు చేశాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలే మిగతా కథ.

Follow on Google News Follow on Whatsapp

READ  Thunivu: నెట్ ఫ్లిక్స్ లో సంచలనం సృష్టించిన అజిత్ తునివు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories