అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రయాణం తొలి చిత్రం గంగోత్రి 28 మార్చి 2003న విడుదలవడంతో మొదలయింది. నిజానికి అల్లు అర్జున్ స్టార్ ఒక ఫ్యామిలీ వారసుడిగా అరంగేట్రం చేశారు, అయితే మెల్లగా తనదైన స్క్రిప్ట్‌లను ఎంపిక చేసుకోవడంతో తనకంటూ సొంత అభిమానులను సృష్టించుకున్నారు.
అలాగే తనకంటూ ప్రత్యేక అభిమానులను ఏర్పరుచుకోవడంలో, ఇతర హీరోల కంటే ప్రత్యేకతను సంతరించుకోవడంలో ఆయన కృషి మరియు అభిరుచిల పాత్ర ఎంతైనా ఉంది. కాగా తన ఇరవై ఏళ్ల ప్రయాణంలో తనని ఆదరించిన అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ అల్లు అర్జున్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నారు.
ప్రస్తుతం, అల్లు అర్జున్ ఖచ్చితంగా ఈ తరం పిల్లలు మరియు ప్రేక్షకులకు మొదటి ఎంపికగా నిలుస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఆయన ప్రయాణం చాలా మంది యువకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. తన ప్రతి చిత్రానికి పూర్తి వైవిధ్యాన్ని చూపుతూ ఏ రకమైన చిత్రం లేదా పాత్రకైనా 100% పైగా అందించగల అరుదైన నటులలో అల్లు అర్జున్ ఒకరు. మరియు ఇప్పుడు ఆయన తన కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నారు. తన తాజా చిత్రం పుష్ప సినిమా భారతదేశవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించగా.. ఆ చిత్రానికి సీక్వెల్ అయిన పుష్ప 2 ఇప్పుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చాలా మంది ఎదురుచూస్తున్న చిత్రం.
అల్లు అర్జున్ ఎక్కువగా ఆర్య, దేశముదురు, జులాయి, రేసు గుర్రం చిత్రాలలో వినోదభరితమైన నటనకు ప్రసిద్ది చెందారు. అయితే పరుగు, ఆర్య 2 మరియు వేదం చిత్రాలలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు. 2016లో అల్లు అర్జున్ సరైనోడు లాంటి ఔట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని తీసి అందరికి షాక్ ఇచ్చారు మరియు అక్కడ నుండి ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక అలా వైకుంఠపురములో ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగు సినిమాకి నాన్ బాహుబలి రికార్డ్ షేర్ వసూలు చేయడం ద్వారా అల్లు అర్జున్ స్టార్‌డమ్ యొక్క గరిష్ట ప్రభావాన్ని చూపించింది.
పైన చెప్పినట్లుగా, అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 కోసం పని చేస్తున్నారు మరియు తాజా నివేదికల ప్రకారం, అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏప్రిల్ 8వ తేదీన 3 నిమిషాల గ్లింప్స్ వీడియో విడుదల చేయబడుతుందని తెలుస్తోంది. మరో 2-3 రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక పోస్టర్ ద్వారా ఇదే విషయాన్ని ధృవీకరిస్తారని తెలియవచ్చింది.