Homeసినిమా వార్తలుAdipurush: ప్రభాస్ భారీ బడ్జెట్ మూవీ ఆదిపురుష్ మరోసారి వాయిదా పడనుందా?

Adipurush: ప్రభాస్ భారీ బడ్జెట్ మూవీ ఆదిపురుష్ మరోసారి వాయిదా పడనుందా?

- Advertisement -

ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్ విఎఫ్ఎక్స్ కు సంభందించిన పనులలో నాణ్యత లోపించిన కారణంగా ఇబ్బందుల్లో పడింది. దర్శకుడు ఓం రౌత్ మరియు చిత్ర బృందం ఈ సినిమా కంటెంట్ ని ఇంకాస్త బెటర్ గా చూపించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం విఎఫ్ ఎక్స్ యొక్క కొత్త అప్డేట్ చిత్ర బృందం అంచనాలను అందుకోలేకపోయిందని తెలుస్తోంది.

టీజర్ లో వీఎఫ్ ఎక్స్ పై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో సంక్రాంతి నుంచి జూన్ కి సినిమాను వాయిదా వేసి విఎఫ్ ఎక్స్ పై రీ వర్క్ స్టార్ట్ చేశారు ఆదిపురుష్ నిర్మాతలు. అయితే తాజాగా రివర్క్ చేసిన విఎఫ్ ఎక్స్ వర్క్ తో కూడా వారు పెద్ద సంతోషంగా లేరని సమాచారం. దీని పై టీమ్ మరోసారి కసరత్తు ప్రారంభించిందని, సరైన అవుట్ పుట్ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు.

కాబట్టి అద్భుతమైన వీఎఫ్ఎక్స్ కలిగిన టీజర్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని, తద్వారా సినిమాకు కావాల్సిన పాజిటివ్ హైప్ క్రియేట్ చేస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. ఈ పరిస్థితులు చూస్తుంటే ఆదిపురుష్ విడుదలకు అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టడం ఖాయమని, జూన్ 16 నుంచి సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయని అంటున్నారు.

READ  Pathaan: షారుఖ్ ఖాన్ తెలుగు రాష్ట్రాల్లో పఠాన్ సినిమా చూడాలని అనుకుంటున్నారు కానీ అందుకు ఓ షరతు పెట్టారు

అయితే ఇలా నిరంతరం వీఎఫ్ఎక్స్ మార్పుల కారణంగా ఈ సినిమా బడ్జెట్, ప్రొడక్షన్ టైమ్ గణనీయంగా పెరిగిపోవడంతో ఓం రౌత్ అండ్ టీం పై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. వీఎఫ్ఎక్స్ రిజల్ట్ ఎలా ఉంటుందోనని ప్రభాస్ ఫ్యాన్స్ కంగారు పడుతుండగా, ఆదిపురుష్ సినిమా రిజల్ట్ పై కూడా వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. దేశ వ్యాప్తంగా ఈ ప్రమోషనల్ క్యాంపెయిన్ త్వరలో భారతదేశంలోని అన్ని నగరాల్లో జరుగుతుంది, అన్ని చోట్లా ఉత్తేజకరమైన కార్యక్రమాలను ప్లాన్ చేస్తారు. ప్రభాస్ ‘ఆదిపురుష్’ ఇండియాలోనే అత్యంత ఖరీదైన సినిమా కావడంతో ప్రమోషన్స్ కూడా అంతే భారీ స్థాయిలో ఉంటాయని భావిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన జానకి పాత్రలో కృతి సనన్, లంకేష్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Selfiee: బాలీవుడ్‌కు షాకిచ్చిన అక్షయ్ కుమార్ సెల్ఫీ ఓపెనింగ్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories