Homeసినిమా వార్తలుRRR HCA Awards: మరో అంతర్జాతీయ అవార్డును అందుకున్న ఎపిక్ ఆర్ ఆర్ ఆర్

RRR HCA Awards: మరో అంతర్జాతీయ అవార్డును అందుకున్న ఎపిక్ ఆర్ ఆర్ ఆర్

- Advertisement -

ప్రతిష్టాత్మక ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ 2023 అవార్డులలో ‘బెస్ట్ స్టంట్స్’ కేటగిరీలో అవార్డు అందుకోవడంతో ఆర్ ఆర్ ఆర్ భారతీయ సినిమాని మరోసారి గర్వించేలా చేసింది. ఈ విషయాన్ని HCA సంస్థ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.

https://twitter.com/HCAcritics/status/1629309397469122562?t=QbykB44xL1kaqfiAXoZGwg&s=19

హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తాజాగా అవార్డులను ప్రకటించింది. ఇందులో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఏకంగా నాలుగు అవార్డులను అందుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ మూవీగా నిలిచింది. కాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ, బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ కేటగిరీ, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఇంటర్నేషనల్ అవార్డులను గెలుచుకుంది.

https://twitter.com/vamsikaka/status/1629332751563509760?t=ZBaCA1AVWW6druEbujYaMw&s=19

ఈ మధ్య కాలంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా వల్ల తెలుగు సినిమా స్థాయి విశ్వవ్యాప్తంగా కీర్తి గడించింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR (రౌద్రం రణం రుధిరం) అటు కలెక్షన్ల పరంగా ప్రపంచ వ్యాప్తంగా దుమ్ముదులపడంతో పాటు ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు కూడా సొంతం చేసుకుంది. అలాగే, ఆస్కార్‌కు సైతం నామినేట్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ యాక్షన్ ఎపిక్ మరో ప్రతిష్టాత్మకమైన అవార్డులను సొంతం చేసుకుని రికార్డు సాధించింది.

READ  Venky75: వెంకటేష్ తొలి పాన్ ఇండియా సినిమాగా రానున్న వెంకీ75 - అదిరిపోయిన ఫస్ట్ గ్లింప్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి తెరకెక్కించిన సినిమానే RRR (రౌద్రం రణం రుధిరం). ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించిన ఈ భారీ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించగా, తారక్ కొమరం భీం పాత్రల్లో కనిపించారు. కాగా ఇద్దరూ తమదైన నటనతో ప్రేక్షకులను అలరించారు.

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా విశేష స్థాయిలో ఆదరణను దక్కించుకుంది. అలాగే హాలీవుడ్ లో సైతం మంచి ప్రభావాన్ని చూపించి ఇప్పటికే ఎన్నో కేటగిరీల్లో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ చాయిస్ సహా ప్రతిష్టాత్మక అవార్డులనూ దక్కించుకుంది. అంతే కాకుండా ఆస్కార్‌కు సైతం నామినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

READ  Veera Simha Reddy OTT: ఈరోజు నుంచి ఓటీటీలో ప్రసారం కానున్న బాలకృష్ణ వీరసింహారెడ్డి

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories