Homeసినిమా వార్తలుమళ్ళీ రిపీట్ కానున్న మ్యాజికల్ కాంబినేషన్

మళ్ళీ రిపీట్ కానున్న మ్యాజికల్ కాంబినేషన్

- Advertisement -

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై ప్రముఖ అగ్ర నిర్మాత సి. అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా.. విడుదల తర్వాత అనూహ్యంగా బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుని సినిమా చూసిన అందరి చేత ఏకగ్రీవంగా అద్భుతమైన సినిమాగా పేరు తెచ్చుకుంది.

‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనే ట్యాగ్ లైన్ తో ఒక మిలిటరీ ఆఫీసర్కి – యువరాణికి మధ్య ప్రేమగాథగా రూపొందిన ఈ సినిమా ఊహించని విధంగా ఘన విజయాన్ని సొంతం చేసుకుని ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసల్ని కూడా సొంతం చేసుకుంది.

దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వ ప్రతిభకు తోడు దుల్కర్ సల్మాన్ మృణాల్ ల అద్భుతమైన నటన సినిమాను చాలా గొప్ప స్థాయిలో నిలబెట్టింది. కేవలం నటన మాత్రమే కాకుండా ప్రేమికులుగా వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా పండింది. సరదా సన్నివేశాలలో ఒకరిని ఒకరు అటపట్టించుకునే విధానం భలేగా ఉండింది. అలాగే సినిమా మొత్తంలో ఇద్దరూ ఒకరిని ఒకరు ముట్టుకునే సన్నివేశాలు చాలా తక్కువ అయినప్పటికీ వారి మధ్య ఉన్న శృంగార సాన్నిహిత్యాన్ని ప్రేక్షకులు భావించేలా ప్రేక్షకులను కట్టిపడేసారు. వెండితెరపై ఈ జంట ఎంతో చూడముచ్చటగా కనిపించి సినిమాకు ప్రధాన బలంగా నిలిచి ప్రతీ ఒక్కరి హృదయాల్ని కొల్లగొట్టేలా చేసింది.

READ  కొత్త ఇల్లు కొన్న తమిళ హీరో విజయ్

అయితే ప్రేక్షకులని ఇంతగా అలరించిన ఈ జంట, వారిని తెరపై అందంగా చూపించిన దర్శకుడు మళ్ళీ కలిసి పని చేస్తారని తెలుస్తోంది .నిర్మాత సి. అశ్వనీదత్, ప్రేక్షకులు ఇంకా సీతా రామం సినిమాని మరచిపోకముందే మళ్ళీ ఈ కలయికలో సినిమా తీసే ఆలోచనలో వున్నారట. త్వరలో దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ జంటగా, హను రాఘవపూడి దర్శకత్వంలో మరో మ్యాజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు సమాచారం. తాజాగా ఈ విషయాన్ని నిర్మాత సి. అశ్వనీదత్ స్పష్టం చేశారు. ఈ విషయం ఖచ్చితంగా దుల్కర్ మృణాల్ ల అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

మరి ఈ హిట్ కాంబినేషన్లో వైజయంతీ మూవీస్ రూపొందించనున్న సినిమా ఎప్పుడు మొదలు పెడతారో.. అలాగే సినిమాకి సంబంధించిన కీలక సమాచారాన్ని అధికారికంగా త్వరలోనే వైజయంతీ మూవీస్ బృందం వెల్లడించనున్నట్టుగా తెలిసింది. ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వచ్చే సినిమా మరో అద్భుతమైన దృశ్య కావ్యంగా నిలవాలని ఆశిద్దాం.

READ  అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సీతారామం

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories