Homeసినిమా వార్తలుSSMB28: మహేష్ బాబు, త్రివిక్రమ్ ల మధ్య SSMB28 టైటిల్ విషయంలో సందిగ్ధత

SSMB28: మహేష్ బాబు, త్రివిక్రమ్ ల మధ్య SSMB28 టైటిల్ విషయంలో సందిగ్ధత

- Advertisement -

మహేష్ బాబు, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న SSMB28 టైటిల్ పై సందిగ్ధత, పుకార్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ చిత్రాల్లో ఇదొకటి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేయనున్నట్లు ఇటీవలే సమాచారం అందింది.

అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేసే విషయంలో తొందరపడటం లేదని మరో సారి వార్తలు వచ్చాయి. అందుకే టైటిల్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారట. ఆయన కొన్ని టైటిల్స్ కూడా ఆలోచించినా కానీ ఇప్పుడు ఆలోచించడానికి మరి కొంత సమయం తీసుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ రకంగా ఈ సినిమా టైటిల్ ను ఉగాదికి విడుదల చేయరని, మహేష్ బాబు గ్లింప్స్ మాత్రమే ఆ రోజు విడుదలవుతుందని అన్నారు.

సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్, నిర్మాతలు ఈ రోజు మహేష్ ను ఇదే విషయమై కలవనున్నారట. ఈ సినిమా టైటిల్ ను ఈ మీటింగ్ లో లాక్ చేసే అవకాశం ఉంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ ల టైటిల్ పై నెలకొన్న సందిగ్ధత ఈ రోజు తీరిపోతుందని అందరూ ఆశిస్తున్నారు.

READ  RRR Re Release: USAలో 200కి పైగా థియేటర్లలో రీ రిలీజ్ అవుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం SSMB28 . దాదాపు 12 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్, మహేష్ కలయికలో వస్తున్న ఈ సినిమా పై అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కాగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు థమన్ ఎస్ సంగీతం అందించనున్నారు. అరవింద సమేత, అల వైకుంఠపురములో చిత్రాల తర్వాత ఆయన త్రివిక్రమ్ తో చేస్తున్న మూడో సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

READ  Sreeleela: తెలుగు చిత్రసీమలో శ్రీలీల డేట్స్‌కు భారీ డిమాండ్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories