Homeసినిమా వార్తలుRRR China: ఆర్ఆర్ఆర్ సినిమాను చైనాలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ను డిమాండ్ చేస్తున్న...

RRR China: ఆర్ఆర్ఆర్ సినిమాను చైనాలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ను డిమాండ్ చేస్తున్న ప్రేక్షకులు

- Advertisement -

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్ ఎపిక్ ఆర్ఆర్ఆర్ జపాన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం జపాన్ లో సంచలన కలెక్షన్లు సాధించడం మరియు ఇటీవల ఆస్కార్ విజయం సాధించడంతో, ఈ చిత్రం ఇతర అంతర్జాతీయ ప్రేక్షకుల నుండి మరిన్ని ప్రశంసలను గెలుచుకునే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ బలంగా భావిస్తున్నారు.

ఇక ఇదే అదునుగా ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని చైనాలో విడుదల చేయాలని ప్రేక్షకులు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.ఈ సినిమా భారీ సెన్సేషన్ క్రియేట్ చేసి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. జపాన్ విడుదల తర్వాత చైనా విడుదలకు కూడా ప్రణాళికలు ఉన్నాయని చిత్ర బృందం ఇదివరకే తెలిపింది. మరి దీని పై ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.

నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం జపాన్ బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ కు సహాయపడింది, ఈ చిత్రం ఆస్కార్ సాధించిన తరువాత కలెక్షన్లను సాలిడ్ జంప్ ను చూసింది. ఇప్పటికే జపాన్ బాక్సాఫీస్ వద్ద ఆర్ ఆర్ ఆర్ అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటి వరకు జపాన్ లో 80 కోట్ల గ్రాస్ వసూలు చేయగా ఆస్కార్ విజయంతో ఈ సినిమా కలెక్షన్స్ లో భారీ పెరుగుదలను చవిచూసింది. ఈ వేగంతో ఈ సినిమా జపాన్ లో మరో 50 కోట్లు సునాయాసంగా రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

READ  RRR: రామ్ చరణ్ - ఎన్టీఆర్ వేర్వేరుగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నారు?

రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం జపాన్ లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇంతవరకూ ముత్తు సినిమా పేరిట ఉన్న రికార్డును క్రాస్ చేసిన ఈ చిత్రం 2 దశాబ్దాలకు పైగా ఉన్న రికార్డుని తిరగరాసి చరిత్రను సృష్టించింది.

ఈ చిత్రం జపాన్ దేశంలో విస్తృతంగా ప్రచారం చేయబడింది మరియు ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు ఎస్ఎస్ రాజమౌళి జపనీస్ ప్రీమియర్ల సమయంలో పాల్గొన్నారు అలాగే అనేక కార్యక్రమాలకు హాజరయ్యారు. మార్చిలో విడుదలైన తొలి రన్ లో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లకు పైగా వసూలు చేసిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఇప్పుడు తన రికార్డ్ బ్రేకింగ్ జర్నీని ఎక్కడ ఆపిందో అక్కడే కొనసాగిస్తుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  Chiyaan Vikram: ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాలో విలన్ గా చియాన్ విక్రమ్??


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories