తాజగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రముఖ దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా గురించి అందరిలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే.
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్ర, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు చేస్తుండగా ఇందులో పలువురు హాలీవుడ్ నటులు కూడా నటించనున్నట్లు టాక్.
ఇక ఇప్పటికే ఒక షెడ్యూల్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పూర్తి చేసుకున్న SSMB 29 మూవీ యొక్క సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతంలో గ్రాండ్ గా జరుగుతోంది .అయితే దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం ఒక చిన్న వీడియో ఫ్యూటేజ్ సోషల్ మీడియాలో లీక్ అయి విపరీతంగా వైరల్ అయింది. దానితో అప్రమత్తమైన మూవీ టీమ్, లీక్ చేసిన వారిపై చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
అయితే మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ కథ కాశీ చరిత్రకు సంబంధించిందిగా ఉండనుందట. పురాణాలకు, నేటి కాలానికి ముడిపెడుతూ సినిమా సాగుతుందని అంటున్నారు. దీని కోసమే మూవీ టీమ్ హైదరాబాద్ లో కాశీ సెట్ వేశారని అంటున్నారు. రామాయణంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చే ఘట్టం ఈ కథకు ప్రధాన స్ఫూర్తి అని తెలుస్తోంది.
ముఖ్యంగా మహేష్ బాబు పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉండడంతో పాటు స్టోరీ కూడా అద్భుతంగా సిద్ధం చేశారట జక్కన్న. మొత్తంగా ఈ భారీ మూవీ లీక్ తరువాత ప్రపంచవ్యాప్తంగా అందరిలో మరింతగా క్యూరియాసిటీ అయితే ఏర్పరిచింది అని చెప్పాలి. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి ఈ మూవీని 2027 సమ్మర్ లో ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు టీమ్ ఏర్పాట్లు చేస్తోందట.