ప్రస్తుతం కోలీవుడ్‌లో Thalapathy67 హాట్ టాపిక్ గా మారింది. తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. అయితే ఈ సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన బాషా తరహాలోనే ఈ సినిమా ఉండబోతోందనే పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి.
దక్షిణ భారత సినిమాకు బాషా ఫార్మాట్ కొత్త కాదు. ఎన్నో సినిమాలకు ఈ ఫార్ములా వాడినప్పటికీ.. ఇంకా సినీ ప్రేమికుల్లో, ముఖ్యంగా అభిమానుల్లో అదే స్థాయిలో ఈ ఫార్మాట్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఎందుకంటే కథ మరియు సెటప్‌లో హీరో ఎలివేషన్స్ కి తగిన స్కోప్ ఉంటుంది. కాబట్టి, ఈ ఫార్మాట్‌ని ఎన్నిసార్లు పునరావృతం చేసినా, సరైన కథనంతో చేస్తే అది ప్రశంసించబడుతుంది.
Thalapathy67 సెకండాఫ్‌లో వచ్చే పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్‌తో ఉంటుందని సమాచారం. కాగా ముంబయి నేపథ్యంలో ఫ్లాష్‌బ్యాక్‌ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
విజయ్ తన మునుపటి సినిమాలలో ఒకటైన తలైవాలో కూడా ముంబైలో ఇలాంటి ఫ్లాష్‌బ్యాక్ సెట్ చేసారు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పరాజయం పాలైంది. సినిమా విడుదలకు ముందు రాజకీయ సమస్యల కారణంగా కూడా వార్తల్లో నిలిచింది.
అండర్‌వరల్డ్, డ్రగ్స్ మాఫియా ప్రపంచాన్ని సినిమాల్లో ఆసక్తికరంగా చూపించే దర్శకుడు లోకేష్ ఈసారి ఈ సబ్జెక్ట్‌ని సరికొత్త టేకింగ్‌తో మరో స్థాయికి తీసుకెళ్తున్నారు.
బ్లాక్‌బస్టర్ సినిమాలు మరియు పాత్రలను కలిగి ఉన్న లోకేష్ కనగరాజ్ యొక్క యూనివర్స్ లో ఈ చిత్రం భాగం అవుతుంది. విక్రమ్, రోలెక్స్, డిల్లీ తదితర పాత్రలు ఇప్పటికే ఐకానిక్‌గా నిలిచాయి. విజయ్ మరియు లోకేష్ ఇదివరకూ మాస్టర్ కోసం పనిచేసినప్పటికీ, ఆ సినిమా ఈ విశ్వంలో భాగం కాదు.
ఈ మోస్ట్ ఎవైటెడ్ యూనివర్స్‌లో తమ అభిమాన హీరో సినిమా భాగమని విజయ్ అభిమానులు ఇప్పుడు ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ఇప్పటికే 250 కోట్లకు తీసుకున్నట్లు సమాచారం. Thalapathy67 భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో మరిన్ని చిత్రాలకు బాటలు వేయాలని కోరుకుందాం.