కోలీవుడ్ నటుడు ఇళయదలపతి విజయ్ ఇటీవల తన కెరీర్ లాస్ట్ మూవీ అయిన 69వ మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీని కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించనుండగా యువ దర్శకడు హెచ్ వినోద్ దీనిని తెరకెక్కించనున్నారు. తాజాగా ది గోట్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన విజయ్ దానితో మంచి విజయం సొంతం చేసుకున్నారు.
తెలుగులో అంచనాలు పెద్దగా అందుకోని ఈ మూవీ తమిళనాడు, ఓవర్సీస్, కేరళ వంటి ప్రాంతాల్లో బాగానే కలెక్షన్ రాబట్టింది. ఇక విషయం ఏమిటంటే, తాజాగా తన లాస్ట్ మూవీ కోసం విజయ్ ఏకంగా రూ. 275 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు కోలీవుడ్ వర్గాల బజ్. ఒకరంగా ఇది ఇండియాలోనే ఒక నటుడు అందుకుంటున్న అత్యధిక రెమ్యునరేషన్ అని చెప్పాలి.
అయితే పాన్ ఇండియన్ హీరోలుగా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్, అల్లు అర్జున్ కూడా విజయ్ ని ఈ విషయంలో చేరుకోలేకపోయారు. ప్రస్తుతం ప్రభాస్ రూ. 150 – 200 కోట్ల వరకు ప్రతి మూవీకి తీసుకుంటుండగా అల్లు అర్జున్ కు రూ. 100 – 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ లభిస్తోంది. మొత్తంగా విజయ్ ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం భారీ చర్చనీయాంశంగా మారింది.