లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం టీజర్ విడుదలైంది. ఇప్పటి వరకు దళపతి 67 అని వర్కింగ్ టైటిల్ పెట్టిన ఈ చిత్రానికి లియో – బ్లడీ స్వీట్ అనే అధికారిక పేరు వచ్చింది. ఈ వార్త కోసం విజయ్ అభిమానులు కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు. టైటిల్ తెలుసుకోవడంతో పాటు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో రాబోయే ఈ సినిమా సెట్ అవుతుందా లేదా అని టీజర్ లో అలాంటి హింట్ ఉంటుందా అని కూడా అభిమానుల ఎదురు చూశారు.
అయితే టీజర్ చూసిన తర్వాత అందరూ ఈ టీజర్ ను విక్రమ్ టీజర్ తో పోలుస్తున్నారు. లియో టీజర్ విక్రమ్ టీజర్ చూపిన ప్రభావానికి దగ్గరలో కూడా లేదు. ఎక్కువగా నిడివి ఉండటంతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా జస్ట్ ఓకే అనిపించడంతో టీజర్ తోనే ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యారు.
ఈ ప్రోమో విక్రమ్ టైటిల్ రివీల్ వీడియోను గుర్తు చేస్తోంది. విక్రమ్ ప్రోమోలో కమల్ హాసన్ పోలీసు అధికారులు, రాజకీయ నాయకుల బృందం కోసం మాంసాహార వంటలు చేయడం చూపిస్తారు. కాగా ఇక్కడ లియో ప్రోమోలో విజయ్ రకరకాల చాక్లెట్లను సిద్ధం చేస్తున్నారు. ఇంటర్ కట్ లో విజయ్ కత్తి తీయడం కూడా మనం చూడచ్చు. కార్ల బెటాలియన్ అతని ఇంటికి చేరుకోవడంతో క్లిప్ ముగుస్తుంది, మరియు నటుడు చాక్లెట్ తో కూడిన కత్తిని పట్టుకోవడంతో టీజర్ ముగుస్తుంది.
మరింత లోతుగా వెళితే ఈ టీజర్ లో నాగార్జున నటించిన ఘోస్ట్ మూవీ యొక్క తమహగ్నే ప్రోమోను పోలి ఉంది. విడ్డూరం ఏంటంటే ది ఘోస్ట్ విక్రమ్ నుంచే ప్రేరణ పొందింది. ఓవరాల్ గా లియో టీజర్ విక్రమ్ లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో విఫలమైందని నెటిజన్లు అంటున్నారు.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న లియో చిత్రంలో విజయ్ టైటిల్ పాత్రలో నటిస్తుండగా.. సంజయ్ దత్, మాథ్యూ థామస్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అర్జున్ సర్జా, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్, శాండీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.