బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ సినిమా చేయడానికి తెలుగు నిర్మాతలు చాలా కష్టపడుతున్నారు. ఇటీవల నాని నటించిన జెర్సీ చిత్రాన్ని హిందీలో గీతా ఆర్ట్స్, దిల్ రాజు, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా రీమేక్ చేసి విడుదల చేయగా ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు అల వైకుంఠపురములో రీమేక్ విషయంలోనూ అదే ఫలితం వచ్చేటట్లు కనిపిస్తుంది.
అల వైకుంఠపురములో సినిమాకి అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను అల్లు అరవింద్, భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. దారుణమైన అడ్వాన్స్ బుకింగ్స్ ను దక్కించుకుంది. ఇక ఈ సినిమా పై బాలీవుడ్ ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి చూపకపోవడంతో మొదటి రోజు కానీ, ఆ తర్వాత కానీ ఈ సినిమా పట్టాలెక్కడం పై ఎలాంటి ఆశలు కనిపించడం లేదు.
కేవలం ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు ఇంతకు ముందు కూడా మన తెలుగు నిర్మాతలు తెలుగు సినిమాల హిందీ రీమేక్ లతో కోట్ల రూపాయలు నష్టపోయి మళ్ళీ టాలీవుడ్ కి వచ్చారు. తెలుగు సినీ పరిశ్రమలోని భారీ నిర్మాతల్లో ఒకరైన అశ్వనీదత్ కూడా గతంలో బాలీవుడ్ లో సినిమాలు తీసి కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు.
రీమేక్ లు ప్రేక్షకులకు నచ్చుతాయా లేదా, ఒరిజినల్స్ కు అవి న్యాయం చేస్తాయా అనేది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్న ప్రశ్న. ఈ మధ్య కాలంలో రీమేక్ అయిన కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద మంచి ప్రశంసలు అందుకున్నాయి. సాధారణంగా తెలుగు సినిమా రీమేక్ లకు హిందీ మార్కెట్ లో బాగా ఆడతాయి.
కానీ కరోనా మహమ్మారి తర్వాత అంతా మారిపోయింది. ముందుగానే ఒక సినిమా డబ్బింగ్ వెర్షన్ అందుబాటులోకి వస్తే ఆ సినిమా రీమేక్ వెర్షన్ విజయం సాధించడం చాలా కష్టమయిపోయింది. దృశ్యం 2 మాత్రమే హిందీలో సౌత్ నుండి విజయవంతమైన రీమేక్ గా తెరకెక్కిన చిత్రంగా నిలిచింది. కానీ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒరిజినల్ చిత్రం హిందీ వెర్షన్ లో అందుబాటులో లేకపోవడం ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.
దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన విశ్వక్ సేన్ హిట్ యొక్క హిందీ రీమేక్ కూడా డిజాస్టర్ అయింది. రాజ్ కుమార్ రావు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి హిట్ -ది ఫస్ట్ కేస్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రం మంచి ఆరంభాన్ని అందుకోలేకపోయింది, మరియు దారుణమైన కలెక్షన్లను బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.