Homeసినిమా వార్తలుస్టార్ డైరెక్టర్లు మాత్రమే కావాలి అంటున్న తెలుగు హీరోలు

స్టార్ డైరెక్టర్లు మాత్రమే కావాలి అంటున్న తెలుగు హీరోలు

- Advertisement -

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రస్తుతం సరిహద్దులు దాటి తన ఖ్యాతిని మరియు స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా ఆదరణను పొందుతుంది. ఈ క్రమంలో తెలుగు హీరోలకు తమ స్టార్ డం ను పెంచుకునే అవకాశం లభించింది. ఈ దశలో ప్యాన్ ఇండియా స్టార్ హోదాను సాధించిన ప్రస్తుత హీరోలలో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ మరియు జూ.ఎన్టీఆర్ మొదటి వరుసలో ఉంటారు.

వీరు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్‌తో పాటు ఓవర్సీస్‌లో కూడా తమకంటూ ఓ ఇమేజ్‌ని సంపాదించుకున్నారు.ఇక ఇంతటి భారీ పాన్-ఇండియా స్థాయి బ్లాక్‌బస్టర్‌లను సాధించిన తర్వాత, ఇక పై చేసే సినిమాల విషయంలో చాలా జాగర్తగా ఉండాలి అని ఏ నటుడైనా అనుకోవడం సహజమే కదా. తమ ప్రతిభను అద్భుతంగా చూపించేందుకు విపరీతమైన మార్కెట్ సిద్ధంగా ఉండగా, కేవలం తెలుగు సినిమాల వరకే కట్టుబడి ఉండడం అంత తెలివైన నిర్ణయం అనిపించుకోదు. అందుకే ప్రస్తుతం మన ప్యాన్ -ఇండియన్ స్టార్స్ అందరూ పరిశ్రమలో అంతగా స్థిరపడని, లేదా కొత్తగా అనుభవం లేని దర్శకులతో పని చేయడానికి ఆసక్తి చూపటం లేదు. తమకంటూ ఒక స్టార్ ఇమేజ్ ఉన్న దర్శకులతో మాత్రమే పని చేయాలని అనుకుంటున్నారు.

నిజానికి, అల్లు అర్జున్, రామ్ చరణ్ మరియు జూ.ఎన్టీఆర్ ఇదే కారణంగా తాము ఇంతకుముందే ఓకే చేసిన సినిమాలను రద్దు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా విడుదలకు ముందే వేణు శ్రీరామ్‌తో ఐకాన్ అనే చిత్రానికి కమిట్ అయ్యారు. అయితే పుష్ప సినిమా భారీ స్థాయిలో ప్యాన్ – ఇండియా విజయం సాధించిన తర్వాత, అల్లు అర్జున్ ఐకాన్ సినిమా నుండి తప్పుకున్నారు. కాగా ప్రస్తుతం ఆయన విస్తృతమైన రీచ్ తో పాటు అన్ని విధాలుగా బలమైన మార్కెట్ మరియు ఇమేజ్ ఉన్న దర్శకుడితోనే పనిచేయాలని ఆయన అనుకుంటున్నారు.

READ  ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్న దుల్కర్ సల్మాన్

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఒక భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాను చేయాల్సి ఉంది. అయితే రామ్ చరణ్ కూడా అవే కారణాల వల్ల గౌతమ్ తో సినిమాను రద్దు చేసుకున్నట్లు సమాచారం. చరణ్ ఇప్పటికే శంకర్ తో RC15 షూటింగ్‌లో ఉన్నారు. తర్వాత సినిమా కూడా అదే స్థాయిలో ఉండాలి అన్న ఆలోచనలో ఉన్నారట. ఆ విధంగా ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాగా పేరు తెచ్చుకున్న దర్శకులతో మాత్రమే పనిచేయాలనుకుంటున్నారు.

అదే విధంగా, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా కంటే ముందు బుచ్చి బాబు సనాతో ఒక చిత్రాన్ని చేయాల్సి ఉంది, అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు లభించిన గ్లోబల్ రీచ్ తర్వాత బుచ్చిబాబుతో సినిమాను ఎన్టీఆర్ రద్దు చేసినట్లు తెలుస్తోంది.

Follow on Google News Follow on Whatsapp

READ  NTR30: కథను పూర్తిగా మార్చేసిన కొరటాల శివ


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories