Homeసినిమా వార్తలుPonniyin Selvan: తమిళ్ ప్రైడ్ పొన్నియిన్ సెల్వన్ అంటే అస్సలు ఆసక్తి చూపని తెలుగు ప్రేక్షకులు

Ponniyin Selvan: తమిళ్ ప్రైడ్ పొన్నియిన్ సెల్వన్ అంటే అస్సలు ఆసక్తి చూపని తెలుగు ప్రేక్షకులు

- Advertisement -

మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ 1 గత ఏడాది భారీ బజ్ మధ్య విడుదలై తమిళనాట బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయగలిగింది. అలానే ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా అద్భుతంగా ఆడింది. ఇక ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సైనా మంచి వసూళ్లు రాబట్టింది కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో మాత్రం అనుకున్నంత గొప్పగా ఆడలేదు.

పొన్నియిన్ సెల్వన్ 1 కోలీవుడ్ లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచి రూ.500 కోట్ల గ్రాస్ మార్కును దాటింది. ఈ సినిమా ఓటీటీలో విడుదలైనప్పుడు కేజీఎఫ్ తరహాలో డిజిటల్ ప్లాట్ ఫారంలలో కూడా చక్కని ప్రభావాన్ని చూపిస్తుంది అని నిర్మాతలు భావించారు. కానీ ఓటీటీ రిలీజ్ లో కూడా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పేలవమైన రివ్యూలు వచ్చాయి.

ఈ సినిమా రెండో భాగం పై భారీ అంచనాలు నెలకొనాలంటే మొదటి భాగానికి భారీ స్థాయిలో ఓటీటీ స్పందన చాలా అవసరం. కానీ ఇప్పుడు ఈ సీక్వెల్ కు భారతీయ సినిమా అంతటా బాహుబలి 2 లేదా కెజిఎఫ్ 2 కు ఉన్న హైప్ ఇతర భాషల నుండి ఉండదు అన్నట్లే కనిపిస్తుంది.

READ  Dasara: థియేట్రికల్ రైట్స్ అమ్మడం ద్వారా కోట్ల రూపాయలు పోగొట్టుకున్న దసరా నిర్మాత

ఎందుకంటే ఈ సినిమాకి టీవీ ప్రీమియర్ విషయంలో కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ తమిళ బ్లాక్ బస్టర్ పై తెలుగు ప్రేక్షకులు ఎందుకో పెద్దగా ఆసక్తి చూపలేదు.

కేవలం రూ.10 కోట్ల షేర్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా తక్కువ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాను బుల్లితెర పై చూసేందుకు కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు. పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం యొక్క తెలుగు వెర్షన్ టెలివిజన్ ప్రీమియర్ కు 2.73 రేటింగ్ వచ్చిందంటే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను చూడటానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదన్న విషయం స్పష్టం అవుతుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  Veera Simha Reddy: వీరసింహారెడ్డి రన్ దాదాపు అయిపోయినట్లే - నష్టాల్లో ఉన్న థియేటర్లు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories