యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కార్తికేయ 2 సినిమా ఆగష్టు 13న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు నుంచే అద్భుతమైన స్పందనను తెచ్చుకున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రోజు రోజుకూ కలెక్షన్లను పెంచుకుంటూ పోతుంది. మౌత్ టాక్ చాలా బాగుండటంతో రెండవ రోజు మరియు మూడవ రోజున ఈ చిత్రం అసాధారణమైన కలెక్షన్లను నమోదు చేస్తుంది.
కార్తికేయ 2కి మొదటి భాగం అయిన కార్తీకేయ కూడా బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయాన్ని సాధించింది. అందువల్లే ఈరోజు కార్తికేయ 2కి ప్రేక్షకులలో అంత ఆసక్తి ఏర్పడింది. సీక్వెల్ సినిమాలు అంటే ప్రేక్షకుల నుంచి తప్పకుండా ఆదరణ లభిస్తుంది. ఇదేమీ కొత్త విషయం కాదు ఇంతకు ముందే పలు మార్లు నిరూపించబడిన విషయం.
బాహుబలి: ది కన్‌క్లూజన్ మరియు KGF చాప్టర్ 2 వంటి సీక్వెల్ చిత్రాలు ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ రెండు చిత్రాలు కూడా ఫ్రాంచైజీ సినిమాలు అవడం వలన అద్భుతమైన కలెక్షన్‌లను నమోదు చేశాయి. ఈ రెండు సినిమాలూ ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అవడానికి కేజీఎఫ్ చాప్టర్ 2 కన్నడ చిత్రం అయినా ఒక్క తెలుగు వెర్షన్ తోనే ఏకంగా100 కోట్ల షేర్ సాధించడం విశేషం.
ఇప్పుడు అదే పంథాలో కార్తికేయ 2 కూడా కాస్త మంచి టాక్, మరియు డీసెంట్ రివ్యూలతో అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. కొంత మంది టైర్ 2 రేంజ్ హీరోలతో సమానంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను రాబడుతోంది. నిజం చెప్పాలంటే ఈ చిత్రం కొంత మంది టైర్ 2 హీరోల అత్యధిక వసూళ్లను దాటే దిశగా అడుగులు వేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. నిఖిల్ కెరీర్ లోనే అన్ని ఏరియాలలో అత్యధిక వసూళ్లను సాధిస్తుంది కార్తీకేయ 2.
కార్తికేయ లాంటి చిన్న ఫ్రాంచైజీనే ప్రేక్షకులను ఇంతలా ఆకట్టుకుంది అంటే , ఇక మోస్ట్ అవైటెడ్ ప్యాన్ ఇండియా సినిమా పుష్ప 2 ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడానికే హద్దులు లేవని చెప్పచ్చు. కార్తికేయ 2లో అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి మరియు వైవా హర్ష కూడా నటించారు. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకుడు కాగా, కాల భైరవ సంగీత దర్శకుడు.