Homeసినిమా వార్తలుతెలుగు ప్రేక్షకులను తక్కువ అంచనా వేసి తప్పు చేసిన వారిసు టీమ్

తెలుగు ప్రేక్షకులను తక్కువ అంచనా వేసి తప్పు చేసిన వారిసు టీమ్

- Advertisement -

దళపతిగా తమిళ ప్రేక్షకుల చేత పిలిపించుకునే తమిళ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న తాజా చిత్రం వారిసు చిత్రం కాస్త వివాదాస్పద పరిస్థితులను ఎదుర్కొంటోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా రూపొందుతొంది. కాగా ఈ సినిమా తెలుగు వెర్షన్‌కి ‘వారసుడు’ అనే పేరు పెట్టారు.

నిర్మాత మరియు దర్శకుడు తెలుగు వారు కాబట్టి ఇది తెలుగు సినిమా అనుకుంటారేమో అనుకుని వారిసు పక్కా తమిళ సినిమా అని చిత్ర బృందం పదేపదే చెప్పారు. ఆ రకంగా దీనిని ద్విభాషా చిత్రంగా ప్రచారం చేయలేదు. దీంతో తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమాకి కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

తమిళ ప్రేక్షకుల కోసం, వారి సెన్సిబిలిటీ కోసం తీసిన సినిమా అని వారిసు నిర్మాత మరియు దర్శకుడు చాలాసార్లు పునరుద్ఘాటించారు. వంశీ, దిల్ రాజు మరియు ఇతర సాంకేతిక నిపుణులు తెలుగు పరిశ్రమ నుండి వచ్చిన కారణంగా ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ వారసుడు సినిమాని తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని చూస్తున్నారు.

READ  దిల్ రాజును తప్పుబడుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేసిన నెటిజన్లు

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి దిల్ రాజు మంచి థియేటర్లను కూడా బ్లాక్ చేశారని తెలుస్తోంది. 2019లో పెట్టా సినిమా ధియేటర్ల వివాదం సందర్భంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ డబ్బింగ్ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇవ్వవద్దని తెలుగు నెటిజన్లతో పాటు నిర్మాతల మండలి కూడా నిర్మాత దిల్ రాజుకు సలహా ఇచ్చింది.

వారిసు సినిమాను ద్విభాషా చిత్రంగా ప్రొజెక్ట్ చేసి ఉంటే, థియేటర్ల నిర్వహణ గురించి ఇంత వివాదం అయ్యేది కాదు. వారిసు కోసం చిత్ర బృందం తమిళ సినిమా ట్యాగ్‌ని కోరుకున్నందున, నెటిజన్లు సంక్రాంతి రేసులో దీనికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అడుగుతున్నారు.

తమిళ ప్రేక్షకులను మరియు విజయ్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు వారిసు అనేది పక్కా తమిళ సినిమా అనే నానుడిని బాగా ప్రసిద్ధి చేసారు.

ఈ రోజుల్లో సినిమాలు ఎదుర్కొంటున్న పరిణామాలకి నిర్మాతలు మరియు దర్శకులు చెప్పే మాటలు లేదా కొన్ని సార్లు వారు ఇచ్చే ప్రకటనలు కూడా కారణం అవుతున్నాయి. ప్రతి ప్రకటనను కూడా సోషల్ మీడియాలో విమర్శనాత్మక పద్ధతిలో అంచనా వేస్తారు.

READ  టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద పోటీకి సిద్ధం అవుతున్న సంక్రాంతి - 2023

అందుకే సినిమా గురించి మాట్లాడే ముందు నిర్మాతలు లేదా చిత్ర బృందం సభ్యులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఏది ఏమైనప్పటికీ, దిల్ రాజు సామర్థ్యం దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో వారిసు భారీ స్థాయిలో విడుదలయ్యే అవకాశం ఉంది. మరి వారసుడు థియేటర్ కేటాయింపు పై ఇండస్ట్రీ వర్గాలు ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories