సినీ పరిశ్రమలో ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయి ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి సక్సెస్ అయితే దాని యొక్క ప్రమోషన్స్ ను బట్టి ముఖ్యంగా ఫస్ట్ లుక్ పోస్టర్ గాని ఆ తర్వాత వచ్చే టీజర్, ట్రైలర్, సాంగ్స్ వంటివి అన్ని కూడా ఆకట్టుకోవడంతో పాటు కంటెంట్ కూడా బాగుంటే ఆడియన్స్ ఆదరిస్తారు. ముఖ్యంగా స్టార్స్ సినిమాలకి ఎక్కువ క్రేజ్ అయితే ఉన్నప్పటికీ లో బడ్జెట్ అలానే దిగువ బడ్జెట్ సినిమాలకి ఒకింత తక్కువ స్థాయి క్రేజ్ ఉంటుంది.
ఇక ముఖ్య విషయం ఏమిటంటే ఇటీవల కొన్ని సినీ ప్రమోషన్స్ లో భాగంవా ఆయా సినిమాలకు సంబంధించిన అక్కడక్కడ కొందరు నటులు సింపతీని బేస్ చేసుకుని సినిమా యొక్క క్రేజ్ పెంచుకుంటున్న అంశాన్ని మనం గమనించవచ్చు. ముఖ్యంగా అక్కడక్కడ పలు సినిమాలకు సంబంధించి మాట్లాడుతున్న నటులు ఫంక్షన్స్ లో సింపతి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఫ్యాక్టర్ అక్కడక్కడ కొన్ని సినిమాల మీద పనిచేసినప్పటికీ కూడా అన్నిసార్లు అది వర్క్ అవ్వదనే చెప్పాలి.
ముఖ్యంగా సినిమా యొక్క కంటెంట్, టేకింగ్ ఇటువంటివి అలానే ఆపైన ఆడియన్స్ యొక్క మౌత్ టాక్ ప్రధానమైన బలాలు. కాగా ఇటీవల ఒక సినిమా సంబందించిన వేడుకలో మనం గమనించినట్లయితే ఒకరు మాట్లాడిన విధానం బట్టి సింపతి గెయిన్ చేయాలన్న అంశాన్ని తెరమీదకి తీసుకురావడం జరిగింది. ఓ రకంగా ఇది ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చినియాంశంగానే మారింది. నిజానికి సింపతి ఫ్యాక్టర్ అనేది ఎంతవరకు పనిచేస్తుంది అంటే సినిమా కంటెంట్ మిగతా అంశాలని బలంగా ఉంటే అది ఒకింత తోడవుతుంది తప్ప కేవలం సంపతి తోనే తమ సినిమాలు హిట్ చేసుకోవాలనే ఆలోచన ఎవరికి వచ్చినా కూడా అది కరెక్ట్ కాదని అంటున్నారు సినీ విశ్లేషకులు.