కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య ఇటీవల కంగువ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు. సిరుతై శివ తెరక్కించిన ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ పోషించగా దిశ పటాని హీరోయిన్ గా నటించారు. అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో డిజాస్టర్ గా నిలిచింది.
ఇక దీని తర్వాత ప్రస్తుతం కార్తీక్ సుబ్బారాజ్ తో ఒక మూవీ అలానే ఆర్జే బాలాజీ తో మరొక సినిమా చేస్తున్నారు సూర్య. తాజాగా లేటెస్ట్ వర్గాల సమాచారం ప్రకారం విడుదలై పార్ట్ 2 అనంతరం వెట్రిమారన్ తో సూర్య జతకట్టనున్నారు. వీరిద్దరి కలయికలో జల్లికట్టు నేపథ్యంలో వాడివాసల్ సినిమా రానందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ అనంతరం సెట్స్ మీదకి వెళ్లనుందని అంటున్నారు. ఇక ఈ క్రేజీ ప్రాజక్ట్ పై మొదటి నుండి అన్ని వర్గాల ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో వాడివాసల్ మూవీకి సంబంధించి టీమ్ నుండి పూర్తి వివరాలకు సంబందించిన అఫీషివల్ డీటెయిల్స్ వెల్లడి కానున్నాయి. తమిళనాడు ప్రధానక్రీడ జల్లికట్టు నేపథ్యంలో ఈ మూవీ గ్రాండ్ లెవెల్లో రూపొందనుంది