కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సూర్య హీరోగా దిశాపటాని హీరోయిన్ గా బాబీ డియోల్ విలన్ గా సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా ఫాంటసీ యాక్షన్ సినిమా కంగువ. ఈ సినిమాపై కోలీవుడ్ తో పాటు తెలుగు ఆడియోస్ లో కూడా విశేషమైన అంచనాలున్నాయి. అనేక భాషల్లో నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానున్న కంగువ మూవీకి సంబంధించి అటు తమిళతో పాటు తెలుగులో కూడా భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు టీమ్.
అలానే తమిళ్ తో పాటు తెలుగులో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్లో జరిగింది. హీరో సూర్యకి తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఈ సినిమా భారీ స్థాయి ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుపుకుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా సూర్య మాట్లాడుతూ కంగువ అనేది యుద్ధాలు మరియు కత్తుల గురించి మాత్రమే కాకుండా ప్రాథమికంగా క్షమాపణ ఇతివృత్తాలపై కేంద్రీకృతమై ఉన్న కథని సూర్య చెప్పారు. ఒకరిని క్షమించడం అనేది ప్రేమ యొక్క అత్యున్నత రూపాన్ని సూచిస్తుందని, కథనాన్ని అండర్లైన్ చేసే పదునైన సందేశం ఈ కథ అని తెలిపారు సూర్య.
అలానే రెండు కాలాల్లో సాగె ఆకట్టుకునే కధ కథనాలతో దర్శకుడు శివ ఈ సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించారని చెప్పుకొచ్చారు సూర్య. ముఖ్యంగా నిర్మాతలతో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచారని అన్నారు. అతడు అందించిన సంగీతంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా రేపు థియేటర్స్ లో అదిరిపోతుందని అన్నారు. తెలుగు ఆడియన్స్ కూడా కంగువ ని ఎంతో బాగా ఆదరిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు సూర్య. మరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.