Homeసినిమా వార్తలుసూర్య 46 మూవీ కాస్ట్ & క్రూ డీటెయిల్స్

సూర్య 46 మూవీ కాస్ట్ & క్రూ డీటెయిల్స్

- Advertisement -

కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సూర్య హీరోగా ఇటీవల రిలీజ్ అయిన రెట్రో సినిమా బాగానే విజయం అందుకుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా కార్తీక్ సుబ్బరాజ్ దీనిని తెరకెక్కించారు. ఇక దాని అనంతరం ఇప్పటికే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సూర్య లేటెస్ట్ గా లక్కీ భాస్కర్ సినిమా దర్శకుడు వెంకీ అట్లూరితో ఒక సినిమాను ప్రారంభించారు.

సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై ప్రతిష్టాత్మంగా నిర్మితమవుతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక నేడు ఈ సినిమా యొక్క అధికారిక పూజా కార్యక్రమాలు గ్రాండ్ లెవెల్ లో జరిగాయి. దీనికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా నిమిష్ రవి ఫోటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. అలానే ఎడిటర్ గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ గా బంగ్లన్ పని చేస్తున్నారు.

ఇక కీలకపాత్రల్లో రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్ కనిపించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుండుగా వచ్చే ఏడాది వేసవికి దీనిని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు టీమ్ అయితే ప్లాన్ చేస్తుంది. మరి క్రేజీ కాంబినేషన్ మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  మళ్ళీ పోస్ట్ పోన్ కానున్న 'హరి హర వీర మల్లు' ?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories