Homeసినిమా వార్తలుKantara: కాంతార సీక్వెల్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్?

Kantara: కాంతార సీక్వెల్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్?

- Advertisement -

రిషబ్ శెట్టి యొక్క కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయం సాధించిందో, ఆ సినిమా ద్వారా సాంస్కృతిక ప్రభావం ఎలా ఉండిందో అందరికీ తెలుసు. ఈ చిత్రం యొక్క బాక్స్-ఆఫీస్ రన్ ఎవరి ఊహకూ అందని స్థాయిలో ఉండి అనేక ప్రాంతాలలో KGF 2 వంటి భారీ పాన్ ఇండియా సినిమాని అధిగమించింది. ఒక్క హిందీ వెర్షన్ నుంచే బాక్సాఫీస్‌ వద్ద కాంతార రూ.100 కోట్లు రాబట్టింది.

ఈ చిత్రం భాషలు, ప్రాంతాలకు అతీతంగా అందరి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది మరియు యష్ యొక్క పాన్-ఇండియా బ్లాక్ బస్టర్ KGF 2 కంటే పెద్ద వసూళ్లు తెచ్చుకుంది. ఇప్పుడు కాంతార శాండల్‌వుడ్‌లో ఆల్ టైమ్ టాప్ గ్రాసర్. కర్ణాటకలో టాప్ షేర్ మరియు టాప్ ఫుట్‌ఫాల్స్ వంటి రికార్డులన్నీ ఈ సినిమా ఖాతాలోనే ఉన్నాయి. ఈ చిత్రం కర్ణాటకలో KGF2 గ్రాస్ నంబర్లు మరియు షేర్లను అధిగమించింది.

అటువంటి భారీ విజయం తర్వాత కాంతార 2 సినిమా కూడా రానుందని చర్చలు జరుగుతున్నాయి మరియు రిషబ్ శెట్టి కూడా ఈ భారీ సీక్వెల్ కోసం తన ప్రణాళికల గురించి ఇది వరకు సూచించారు ఇప్పుడు ఈ సినిమా గురించి మరొక భారీ వార్త ఉద్భవించింది మరియు అది గనక జరిగితే, నిజంగా ఈ సినిమాకి హైప్ తీవ్ర స్థాయిలో ఉంటుంది.

READ  RC15: ఆర్ సి 15 సినిమా పై భారీ బజ్ క్రియేట్ చేసిన లీకైన వీడియోలు

కాంతార 2 లో ఒక కీలక పాత్ర కోసం సూపర్ స్టార్ రజినీకాంత్‌ని సంప్రదించినట్లు సమాచారం. గతంలో రజినీకాంత్‌కి కాంతార సినిమా బాగా నచ్చడంతో రిషబ్‌ని తన ఇంటికి పిలిపించి అభినందించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కాంతార’ చూసి ఆశ్చర్యపోయి రిషబ్ శెట్టిని తన ఇంటికి ఆహ్వానించారు. రజినీకాంత్ రిషబ్ శెట్టికి ఒక బంగారు గొలుసును ఇచ్చి ప్రశంసించారు మరియు ఈ చిత్రం 50 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఘట్టం లాంటిదని కూడా పేర్కొన్నారు.

మరి వినిపిస్తున్న వార్తల ప్రకారం సూపర్‌స్టార్ రజినీకాంత్ గనక కాంతార సీక్వెల్ లో నటించేందుకు తన గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇది నిజంగా చాలా పెద్ద సంచలనం అవుతుంది మరియు కాంతార 2 కోసం మరింత గొప్ప క్రేజ్ ను సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Follow on Google News Follow on Whatsapp

READ  Rajinikanth: బాలకృష్ణ వీరసింహారెడ్డి పై ప్రశంసల జల్లు కురిపించిన సూపర్ స్టార్ రజినీకాంత్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories