Homeసినిమా వార్తలుఒకే వేదిక పై కనిపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు - ఐకాన్ స్టార్ అల్లు...

ఒకే వేదిక పై కనిపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లకు ఎంతటి స్టార్ డం మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ నటనతో, సినిమా కథల ఎంపికలతో విశేషమైన ప్రజాధారణను వారు సంపాదించుకున్నారు.

అయితే ఇంతటి స్టార్‌డమ్ ఉన్నప్పటికో ఈ ఇద్దరు హీరోలను ఒకే వేదిక పై చూడడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది అల్లు అర్జున్, మహేష్ బాబు ఇవాళ ఒకే ఫ్రేమ్ లో కనిపించి సందడి చేశారు.

తెలుగు సినీ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కూతురు పెళ్లి రిసెప్షన్ ఇటీవల హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మహేష్ బాబు, అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే వేదిక పై ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తూ ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

నీలిమ గుణ రవి ప్రాఖ్య అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు.

కాగా మహేష్ బాబు గతంలో గుణశేఖర్ దర్శకత్వంలో ‘ఒక్కడు’, ‘సైనికుడు’ వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఒక్కడు సినిమా కేవలం మహేష్ బాబు కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమలోనే అద్భుతమైన సినిమాలలో ఒకటని చెప్పవచ్చు.

READ  దర్శకుడి అహంకారం వల్లే 2 స్టేట్స్ రీమేక్ ను రద్దు చేశాం అని చెప్పిన అడివి శేష్

ఇక అల్లు అర్జున్ ‘వరుడు’ సినిమాని గుణశేఖర్ తెరకెక్కించగా ఆ సినిమా పరాజయం పాలైంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ ‘శాకుంతలం’ సినిమాతో అల్లు అర్జున్ కూతురు ‘అర్హ’ వెండితెర అరంగేట్రం చేస్తుంది.

మహేష్ బాబు, అల్లు అర్జున్ తో పాటు రాజశేఖర్‌ దంపతులు, దర్శకుడు రాజమౌళి దంపతులు, కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు మణిశర్మ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, మాజీ ఎంపీ సుబ్బరామి రెడ్డి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు రెండో పెళ్లి చేసుకోబోతున్న నటి మీనా


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories