Homeసినిమా వార్తలుRaninikanth: రాకెట్రీ సినిమాని మెచ్చిన సూపర్ స్టార్

Raninikanth: రాకెట్రీ సినిమాని మెచ్చిన సూపర్ స్టార్

- Advertisement -

ఏ సినీ పరిశ్రమలో అయినా బయోపిక్ అనేది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా. ఇప్పటికే ప్రముఖ వ్యాపారవేత్తలు, సెలబ్రెటీల జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన పలు చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల తమిళ నటుడు మాధవన్ ప్రధాన పాత్రలో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రాకెట్రీ – ది నంబి ఎఫెక్ట్ సినిమాను తెరకెక్కించారు. జూలై 1న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది.

తాజాగా ఈ సినిమా ఓటిటిలో విడుదల అయింది, దాంతో ప్రశంసల వెల్లువ కొనసాగుతుంది. ఎందరో ప్రేక్షకులు మరియు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. తాజాగా ఆ లిస్ట్ లోకిసూపర్ స్టార్ రజినీకాంత్ చేరారు. హీరో మాధవన్ పై ప్రశంసలు కురిపించారు. అంతే కాకుండా రాకెట్రీ సినిమా గురించి తన అభిప్రాయాలను ఓ స్పెషల్ నోట్ విడుదల చేశారు.

రాకెట్రీ.. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ముఖ్యంగా యువకులు. మాధవన్ దర్శకత్వంలో తన తొలి చిత్రం పద్మభూషణ్ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ పై తీయడం ద్వారా తనను తాను సమర్థుడైన చిత్ర నిర్మాతగా నిరూపించుకున్నారు. భారతదేశ అంతరిక్ష పరిశోధన కోసం పని చేస్తున్నప్పుడు వారి జీవితంలో చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఇలాంటి చిత్రాన్ని మాకు అందించినందుకు మాధవన్ కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు సూపర్ స్టార్. అలాగే ఈ సందర్భంగా సినిమా తీసిన మాధవన్ ను, శాస్త్రవేత్త నంబి నారాయణన్ ను ఆయన సత్కరించారు.

READ  షో టైం చేంజ్ అంటున్న ది వారియర్

ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా హీరో మాధవన్ రాకెట్రీ – ది నంబి ఎఫెక్ట్ చిత్రాన్ని తెరకెక్కించారు. అతను సాధించిన విజయాలతో పాటు దేశం అభివృద్ధి చెందాలనే ఆశయం కోసం ఏం త్యాగాలు చేశారు, అలాగే ఆయన పై తప్పుడు ఆరోపణలు చేసి గూఢచారి కేసులో ఇరికించినపుడు ఆయన ఎన్ని అవమానాలు దిగమింగి కష్టాలు ఎదురుకున్నారు.. చివరికి తను నిర్దోషి అని ఎలా నిరూపించుకున్నాడు అనే అంశాలను రాకెట్రీ సినిమాలో చక్కగా చూపించారు. ఇందులో నంబి నారాయణన్ పాత్రలో మాధవన్ నటించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. ఇందులో సిమ్రాన్, రవి రాఘవేంద్ర, మిషా ఘోషాల్ కీలకపాత్రలలో నటించారు.

మొదటి నుండి మాధవన్ కు నటుడుగా చక్కని పేరు ఉంది. ఎలాంటి పాత్ర చేసిన దానికి తన నటనతో ప్రత్యేకతను జోడించడం ఆయనకు ఆయనే సాటి. శాస్త్రవేత్త నంబి నారాయణన్ పాత్రలో ఆయన జీవించారంటే అది ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఇక ఆయన భార్య పాత్రలో సిమ్రాన్ కూడా అద్భుతంగా నటించారు. కొన్ని సన్నివేశాల్లో వారిరివురి నటనకు ప్రేక్షకుల కళ్ళు చెమర్చేచే స్థాయిలో భావోద్వేగాలని పండించారు. ఇక ఇంత మంచి సినిమాలో అతిథి సహాయక పాత్రల్లో తమిళ నటుడు సూర్య, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించి తమ అభిరుచిని చాటుకున్నారు. తెలుగు, తమిళ వెర్షన్లో సూర్య నటించగా, హిందీ వెర్షన్లో షారుక్ ఖాన్ నటించారు.

READ  శింబు సినిమా రీమేక్ లో రానా

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories