ప్రముఖ యువనటుడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలిసి గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 ది రూల్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రత్నవేలు ఫోటోగ్రఫీ అందిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం చివరి దశకు చేరుకున్న ఈ మూవీ డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో అత్యధిక థియేటర్స్ లో భారీ స్థాయిలో పలు భాషలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు రెండు సాంగ్స్ కూడా అందరిని ఎంతో ఆకట్టుకుని పుష్ప 2 మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి. ఇక ఈ సినిమా యొక్క టేకింగ్ పరంగా దర్శకుడు సుకుమార్ ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా దాదాపుగా మూడేళ్ల తర్వాత పార్ట్ 2 రిలీజ్ కానుండడంతో తప్పకుండా దీన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా కనెక్ట్ చేసేలా ఆయన పక్కాగా తెరకెక్కిస్తున్నట్లు చెప్తున్నారు. అలానే సుకుమార్ మూడేళ్ళ కష్టం తప్పక ఫలిస్తుందని అంటున్నారు టీమ్. నిజానికి ఈ సినిమాని మొదట ఈ ఏడాది ఆగస్టు 15 రిలీజ్ చేస్తారని ప్రకటించారు.
ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల డిసెంబర్ కి వాయిదా పడింది. విషయం ఏమిటంటే, సుకుమార్ సినిమాని వరుసగా లేట్ చేస్తున్న అంశం టీమ్ పై ఒత్తిడిని మరింతగా పెంచుతోంది, కానీ రిలీజ్ అనంతరం సక్సెస్ సాధించడంతో సుకుమార్ కి మాత్రం అది ప్లస్ అవుతుంది. సుకుమార్ యొక్క ఈ లోపం గత సినిమాల విషయంలో కూడా ఇది జరిగింది. మరి ఫైనల్ గా డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకి రానున్న పుష్ప 2 మూవీ ఏస్థాయి విజయం అందుకుంటుందో ఏ స్థాయిలో కలెక్షన్ సొంతం చేసుకుంటుందో చూడాలి.