Homeసినిమా వార్తలుSukumar: విరూపాక్ష దర్శకుడి ఆరోగ్య పరిస్థితిని తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చిన సుకుమార్

Sukumar: విరూపాక్ష దర్శకుడి ఆరోగ్య పరిస్థితిని తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చిన సుకుమార్

- Advertisement -

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’ఎం శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అయిన కార్తిక్ వర్మ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

అయితే నిన్న (ఏప్రిల్ 16) ఏలూరులోని సీఆర్ రెడ్డి కాలేజ్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు (Pre Release Event) సుకుమార్ చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తిక్ దండు ఎలాంటి విషమమైన ఆరోగ్య పరిస్థితి నుంచి బయటపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారో ఆయన తెలియజేశారు.

‘కార్తిక్‌ నా దగ్గరకు వచ్చినపుడు మెడికల్ ప్రాబ్లెమ్ ఉండేది, ఐదారేళ్లు బతుకుతాడని డాక్టర్లు చెప్పారు. వాళ్ల అమ్మతో సహా హైదరాబాద్ వచ్చేశాడు. అప్పుడు అతను చాలా క్రిటికల్ కండిషన్‌లో ఉన్నాడు. కానీ పోయేలోగా ఒక్క సినిమాకు అయినా దర్శకత్వం చేయాలనుకున్నాడు. అయితే క్రమంగా ఆ ప్రాబ్లెమ్ నుంచి బయటపడి సినిమా కంప్లీట్ చేశాడు. తను సినిమా కంప్లీట్ చేయడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎమోషనల్‌గా ఉంది. ఎందుకంటే కార్తిక్ స్టెరాయిడ్స్ మీద బతికేవాడు. అవి తీసుకోకుంటే బాడీలో ప్లేట్స్‌లెట్స్ పెరగవు. ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటపడ్డాడంటే వాళ్ల అమ్మ ఆశీస్సులే’ అని సుకుమార్ అన్నారు.

READ  Pawan Kalyan: సెప్టెంబర్ లో విడుదల కానున్న పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం

ఇక సినిమా విషయానికొస్తే కార్తీక్ చాలా బాగా తీశాడని ఆయనను అభినందించారు సుకుమార్. కార్తిక్ కథ చెప్పే విధానం బాగుంటుంది అని తెలిపిన సుకుమార్.. ‘ఎవరైనా కథను అద్భుతంగా నెరేట్ చేస్తున్నారంటే సినిమా బాగా తీస్తారనే నమ్మకముంటుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టావు. సినిమా పెద్ద హిట్ అవుతుంది. కార్తిక్ కి మంచి పేరొస్తుంది. పెద్ద డైరెక్టర్ అయిపోతాడు’ అని అన్నారు సుకుమార్.

ఇక హీరో సాయి ధరమ్ గురించి కూడా సుకుమార్ మాట్లాడారు. స్వతహాగా సాయి విపరీతంగా జోకులు బాగా వేస్తుంటాడు. తన జోక్స్‌కు రైటర్స్ కూడా సరిపోరు. కానీ అలాంటి మనిషి యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి ‘విరూపాక్ష’ సెట్స్ వెళ్లి చూసినపుడు తనను చూసి వణికిపోయానని సుకుమార్ బాధ పడ్డారు. నటించడానికి అక్షరం అక్షరం కూడబలక్కునే స్థితి నుంచి పట్టుదలగా ఒక్కొక్కటి నేర్చుకుని సాయి నటించాడని సుకుమార్ చెప్పారు.

అలాగే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పని చేసిన అజనీష్ లోక్ నాథ్, హీరోయిన్ సంయుక్తల పై ప్రశంసలు కురిపించారు సుకుమార్. ముందుగా ఈ క్యారెక్టర్‌కు సంయుక్త సెట్ అవుతుందా లేదా అని అనుమానపడ్డానని.. అయితే తన పెర్ఫామెన్స్ చూశాక మాత్రం ఇంప్రెస్ అయినట్లు తెలిపారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Pushpa 2: అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ పై అందరి దృష్టి


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories