Homeసినిమా వార్తలురంగస్థలం సీక్వెల్ తెరకెక్కించనున్న సుకుమార్ ?

రంగస్థలం సీక్వెల్ తెరకెక్కించనున్న సుకుమార్ ?

- Advertisement -

దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమా కేవలం ఆయన కెరీర్‌లోనే కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో కూడా ఒక చిరస్మరణీయమైన మైలురాయిగా నిలిచింది. విపరీతమైన మాస్ అప్పీల్ ఉన్న హీరోకి ఇక ప్రత్యేకమైన విజన్ ఉన్న దర్శకుడు కలిస్తే ఎలాంటి అద్భుతమైన ఫలితం వస్తుందో ఈ సినిమా నిరూపించింది.

2018లో విడుదలైన రంగస్థలం ఆ సమయానికి తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న అనేక రికార్డులను బద్దలు కొట్టి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి సీక్వెల్ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

బాక్సాఫీస్ వద్ద మొదటి వారంలోనే 80 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి నాన్-బాహుబలి రికార్డులను క్రియేట్ చేయడం ద్వారా రంగస్థలం సినిమా తన ప్రీ రిలీజ్ బిజినెస్‌ను రికవరీ చేసింది. రెండవ వారం ముగిసే సమయానికి, ఈ చిత్రం టాలీవుడ్‌లో నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కాగా ప్రపంచ వ్యాప్తంగా రన్ పూర్తయ్యే సరికి 120 కోట్ల షేర్‌తో ముగిసింది.

READ  కాంతార ఫేమ్ రిషబ్ శెట్టితో రామ్ చరణ్ సినిమా?

ఇక సుకుమార్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో రంగస్థలం సీక్వెల్ కోసం తన ఆలోచనను పంచుకున్నట్లు సమాచారం. ఈ ఆలోచనకు మెగాస్టార్ నుంచి స్పందన కూడా సానుకూలంగా వచ్చిందట.

కాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇప్పటికే విజయ్ దేవరకొండతో పాటు యావత్ భారతదేశ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న పుష్ప 2 సినిమాలతో ఇప్పటికే కమిట్‌మెంట్‌లను కలిగి ఉన్నారు.

ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత రంగస్థలం 2 సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. రామ్ చరణ్ కూడా ప్రస్తుతం RC-15తో బిజీగా ఉన్నారు. ఇక వీరిద్దరూ ఒకసారి ఫ్రీ అయిన తర్వాత, రంగస్థలం 2 కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం నడుస్తున్న ప్యాన్ ఇండియా ట్రెండ్ వల్ల హిందీ బాక్సాఫీస్ వద్ద కూడా రంగస్థలం 2 అద్భుతమైన స్పందన తెచ్చుకుంటుందనే నమ్మకంతో సుకుమార్ కూడా ఉన్నారట. ఆయన నమ్మకం నిజం కావాలని కోరుకుందాం.

Follow on Google News Follow on Whatsapp

READ  సమంత తాజా చిత్రం యశోద పై ట్రేడ్ వర్గాల ఆసక్తి


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories