ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా అత్యధిక స్థాయిలో అందరూ ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రాలలో పుష్ప 2 ఒకటి. మొదటి భాగం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది మార్కెట్‌లో కూడా భారీ విజయాన్ని సాధించింది మరియు ఈ జోరును సద్వినియోగం చేసుకోవాలని నిర్మాతలు అనుకుంటున్నారు సుకుమార్ అండ్ టీమ్ మిగతా ఇండియా మరియు ఓవర్సీస్‌లో రికార్డ్ నంబర్‌లు సృష్టించడం పై దృష్టి సారించారు. అందుకోసం యూనిట్ స్క్రిప్ట్‌లో పలు మార్పులు చేర్పులు చేస్తూ, షూట్ చేయడానికి చాలా సమయం తీసుకుంటుంది.
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప2 అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా కాలం క్రితం ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ అందించాలని టీమ్ ప్లాన్ చేసింది, అయితే ఫైనల్ అవుట్‌పుట్ దర్శకుడు సుకుమార్ కి నచ్చకపోవడంతో చివరి నిమిషంలో వారు అనుకున్న ప్లాన్‌ను నిలిపివేశారు. ఐతే తాజా నివేదికల ప్రకారం, ఈ మావెరిక్ దర్శకుడు ఇప్పుడు టీజర్‌కు సంబంధించి కొత్త ప్లాన్‌తో వస్తున్నారట.
అల్లు అర్జున్ పుట్టిన రోజు [ఏప్రిల్ 8] సందర్భంగా ఫస్ట్ లుక్ మరియు టీజర్‌ను విడుదల చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని, ఈ టీజర్ సంచలనం సృష్టించి అంచనాలను మరో స్థాయికి పెంచాలని సుకుమార్ కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. కాబట్టి, ఆయన మరియు ఆయన సహాయక బృందం ఉత్తమ అవుట్‌పుట్ ఇవ్వడానికి టీజర్ యొక్క పనుల పై వారి ప్రయత్నాలన్నింటినీ మరియు భారీ డబ్బును కూడా వెచ్చిస్తున్నారు.
పుష్ప 2 కథా పరంగా ఎన్నో ఆసక్తికర మలుపులని కలిగి ఉంటుంది మరియు అల్లు అర్జున్ పాత్ర రకరకాల అసమానతలకు వ్యతిరేకంగా పోరాడే అంతర్జాతీయ నేపథ్యాన్ని కలిగి ఉంటుంది. రష్మిక మందన మొదటి భాగం లోని శ్రీ వల్లి పాత్రలోనే నటిస్తుండగా, ఇక భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫాహద్ ఫాసిల్ కూడా అదే పాత్రను కొనసాగిస్తూ ఈసారి ఎక్కువ సమయం ఉండే పాత్రలో కనిపిస్తారు. ఆయన పాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అని అంటున్నారు. ఈ పాన్-ఇండియా సినిమా కోసం జగపతి బాబు కూడా ఒక కీలక పాత్ర కోసం ఎంపికయ్యారు.
గ్లోబల్ లెవెల్లో పుష్పరాజ్ చేసే విన్యాసాలు చూడలం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, మరి సినిమాలో టీమ్ ఏం అద్భుతాలు చేసిందో చూడాలి. ఈ చిత్రం 2024 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. అది గనక నిజమైతే ఎన్టీఆర్ 30తో ఈ సినిమా క్లాష్ అవుతుంది.