Sudheer Babu: టాలీవుడ్‌లో నైట్రో స్టా్ర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో సుధీర్ బాబు ఎంచుకునే కథలు వైవిధ్యంగా ఉంటాయని ప్రేక్షకుల్లో ఓ భావన ఉంది. అందుకే ఆయన చేసే సినిమాలు మినిమం గ్యారెంటీ హిట్ అని అభిమానులు అంటుంటారు. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హంట్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత సుధీర్ బాబు మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు.
అయితే హంట్ మూవీ ఇంకా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్‌ను ఇచ్చాడు ఈ యంగ్ హీరో. దర్శకుడు జ్ఞానసాగర ద్వారక తెరకెక్కిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. అంతేగాక ఈ సినిమాలో భక్తికి సంబంధించి కూడా ఓ కీలక అంశం ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ వీడియోను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ సినిమాకు ‘‘హరోం హర – ది రివోల్ట్’’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయగా.. కుప్పం ప్రాంతంలో 1989లో జరిగిన ఓ యధార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించనున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.
ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో సుధీర్ బాబు చెప్పే డైలాగ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ‘‘ఇంగ సెప్పేదేమీ లేదు.. సేసేదే’’ అంటూ సుధీర్ బాబు చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించింది. ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం అనే పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక చైతన్ భరద్వా్జ్ సంగీతం ఈ సినిమాకు మరో మేజర్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.