ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్లో గత ఏడాది డిసెంబర్లో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నిజానికి తొలి రోజు టాక్ మరియు రివ్యూల పరంగా కాస్త మిశ్రమ స్పందన తెచ్చుకున్నా.. కలెక్షన్లు మాత్రం బాగా రాబట్టింది. అంతే కాకుండా ఎవరూ ఊహించిన విధంగా ఉత్తరాదిన వంద కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.
అయితే పుష్ప సినిమా విజయానికి అల్లు అర్జున్ నటన, తగ్గేదేలే డైలాగ్ – మ్యానరిజం ఎంతగా దోహద పడ్డాయో.. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు కూడా చాలా కీలక పాత్ర వహించాయి.శ్రీవల్లి, సామీ సామీ, ఏ బిడ్డా నా అడ్డా వంటి పాటలు బాగా పాపులర్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఐటెం సాంగ్ అయిన ఉ అంటావా ఊఊ అంటావా పాట పుష్ప పాపులారిటీలో ప్రధాన పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రస్తుతం పుష్ప 2 సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని తెలుగు ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేలా సినిమా పట్ల సుకుమార్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే స్క్రిప్ట్ కుదరడానికి ఎక్కువ సమయం పట్టింది. నిజానికి ముందుగా పుష్ప-2 సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయాలని భావించినా.. ఇప్పుడు అది వచ్చే ఏడాది సమ్మర్ కు వాయిదా వేశారు.
పుష్ప భారీ విజయం తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ పట్ల ప్రతి విషయాన్ని కూడా చాలా శ్రద్ధతో ఆలోచించి మరీ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే అంత బాగా అన్ని విషయాలు చూసుకుంటున్న పుష్ప 2 చిత్ర బృందం ఐటెం సాంగ్ కోసం మాత్రం తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారా అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఇంతకూ పుష్ప చిత్ర బృందం ఐటెం సాంగ్ కోసం ఎంపిక చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరంటే.. హీరోయిన్ కాజల్ అగర్వాల్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెతో ఇప్పటికే చర్చలు జరపగా కాజల్ కూడా ఓకే అన్నారని సమాచారం. ఈ విషయం పై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. కానీ పుష్ప-2 లో కాజల్ ఐటెం సాంగ్ చేయడం మాత్రం ఖాయమనే వినిపిస్తుంది.
పుష్పలో సమంత తో ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఊ అంటావా పాటకు సమంత మాస్ లుక్స్ తో పాటు హాట్ స్టెప్పులు ప్రేక్షకులకి కిరెక్కిచ్చాయి. మరి పుష్ప 2 సినిమాలో ఐటం సాంగ్ అంతకు మించి ఉండాలి అని ప్రేక్షకులు ఆశిస్తారు.
అలాంటిది ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ తో ఐటం సాంగ్ చేయించాలనే ఆలోచన అంత కరెక్ట్ కాదేమోనన్న భావన కొందరు సినీ ప్రేమికులలో, ఇండస్ట్రీ వర్గాలలో కూడా ఉంది. మరి సుకుమార్ పుష్ప 2 ఐటెం సాంగ్ కోసం కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసిన తన సెలక్షన్ కరెక్టే అని అందరి చేతా అనిపించుకుంటారేమో చూడాలి.