టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB29. ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి కీలక సన్నివేశాలని హైదరాబాదులో అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్లో చిత్రికరిస్తోంది టీం.
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్.నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఒక కీలకపాత్ర చేస్తుండగా మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ కూడా మరొక ముఖ్యపాత్ర చేస్తున్నట్టు టాక్.
నిజానికి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. మరోవైపు అతిత్వరలో అనగా ఏప్రిల్ నెలలో సినిమాకి సంబంధించి కీలక షెడ్యూల్ కెన్యా, సౌతాఫ్రికా, బల్గేరియా వంటి దేశాల్లో గ్రాండ్ గా చిత్రీకరించేందుకు సిద్ధమవుతున్నారట మూవీ టీం. అయితే విషయం ఏమిటంటే ఈ లోపు గానే సినిమా యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ ని అలానే ప్రెస్ మీట్ ని నిర్వహించేందుకు జక్కన్న అండ్ టీమ్ సిద్ధమవుతున్నారని లేటెస్ట్ బజ్.
కాగా మార్చి 30న ఉగాది రోజున ఆ అనౌన్స్ మెంట్ ఉండే అవకాశం ఉందట. మరోవైపు మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఈ సినిమా యొక్క అనౌన్స్మెంట్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు తమ ముందుకి వస్తుందా ఎదురు చూస్తున్నారు. మరి ఇంతకీ SSMB 29 అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉంటుందో పక్కాగా తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి.