టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తాజాగా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఈ మూవీలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్ర చేస్తుండగా మరొక ముఖ్య పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ఇప్పటికే సక్సెస్ఫుల్ గా ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో ఒడిశాలో తదుపరి షెడ్యూల్ జరుపుకుంటుందనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. కాగా ఈ షెడ్యూల్ మార్చి 6 నుండి నెలాఖరు వరకు ఉండనుందట. సూపర్ స్టార్ మహేష్ తో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటారట.
ఇప్పటికే అక్కడి పలు ప్రాంతాల్లో షూటింగ్ కోసం ప్రభుత్వం నుండి జక్కన్న అండ్ టీమ్ ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకుందట. ఇక ఈ మూవీలోని తన పాత్ర కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్నాళ్లుగా బల్క్ బాడీతో పాటు ఫుల్ గా క్రాఫ్, గడ్డం పెంచుతున్న సంగతి తెలిసిందే. కాగా వీలైనంత త్వరలో ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్ మెంట్ రానుందని, అలానే మూవీని 2027 సమ్మర్ లో పక్కాగా ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.