Homeసినిమా వార్తలుSSMB28 తాలూకు పుకార్లని ఖండించిన నిర్మాత నాగ వంశీ

SSMB28 తాలూకు పుకార్లని ఖండించిన నిర్మాత నాగ వంశీ

- Advertisement -

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ల కలయికలో మూడోసారి తెరకెక్కనున్న ‘SSMB28’ చిత్రం ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ పేరు ప్రకటించగా, రెండు పాటలు కూడా ఖరారు అయినట్లు సమాచారం అందింది.

అయితే ఆ తర్వాత మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌లో మార్పు చేయాలని మహేష్ బాబు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్‌కి తమన్‌తో అద్భుతమైన వర్కింగ్ రిలేషన్‌షిప్ ఉన్నందున ఈ వార్తలు సినీ ప్రేక్షకులను షాక్‌కు గురి చేశాయి. త్రివిక్రమ్ – థమన్ కాంబినేషన్‌లో ఇంతకు ముందు వచ్చిన సినిమాలు విజయవంతమయిన సంగతి తెలిసిందే.

సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ చిత్రానికి సంగీత దర్శకుడి పై వచ్చిన రూమర్లకు SSMB28 నిర్మాత నాగ వంశీ ముగింపు పలికారు. ఆయన చేసిన ఒక్క ట్వీట్ అన్ని పుకార్లు తప్పని రుజువు చేసింది. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నాడని నాగ వంశీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

https://twitter.com/vamsi84/status/1595328763868614656?t=zr4_aFdrdhOTC9z0agToYg&s=19

ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. త్రివిక్రమ్ తన దర్శకత్వంలో తెరకెక్కే అన్ని సినిమాల కోసం థమన్‌ను అంటిపెట్టుకుని ఉన్నారు మరియు హారిక హాసిని బ్యానర్లో వచ్చే సినిమాలకు కూడా థమన్ పేరే సూచిస్తూ వచ్చారు.

ప్రొడక్షన్ హౌస్ మరియు చిత్ర బృందం కూడా ఈ చిత్రానికి థమన్ అద్భుతమైన సంగీతం ఇస్తారని నమ్మకంగా ఉన్నారు. అయితే పైన చెప్పినట్లుగా, మహేష్ బాబు థమన్‌తో పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదని ఇటివలే కొన్ని పుకార్లు వ్యాపించాయి.

READ  SSMB28 2వ షెడ్యూల్ డేట్ల సమస్యల వల్ల వాయిదా వేయబడిందా?

దర్శకుడు మరియు హీరో ఇద్దరూ కొంత మార్పు కోరుకుంటున్నందున ఈ చిత్రానికి మ్యూజిక్ అనిరుధ్ కంపోజ్ చేస్తారని మరొక రూమర్ ప్రచారంలో ఉండింది. అయితే ఈ రూమర్‌లకు నాగ వంశీ థమన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ చాలా సమర్థవంతంగా ముగింపు పలికారు.

అలాగే SSMB28 సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనా శైలి పై మహేష్ బాబు అసంతృప్తికి సంబంధించిన పుకార్లు కూడా పరిశ్రమలో వేగంగా వ్యాపించాయి. త్వరలోనే సినిమా షూటింగ్ తాలూకు అప్డేట్ లి వాటికి సమాధానాలు ఇస్తుందని ఆశిద్దాం.

Follow on Google News Follow on Whatsapp

READ  నిర్మాతగా మారనున్న నందమూరి బాలకృష్ణ కూతురు తేజస్విని


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories