టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రముఖ సంస్థ శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈమూవీకి సంబంధించి ప్రస్తుతం వేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ హైదరాబాద్ లో జరుగుతోంది.
విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తున్న ఈమూవీ యొక్క అనౌన్స్ మెంట్ కోసం యావత్ ప్రపంచం మొత్తం కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం SSMB29 కోసం విజయేంద్ర ప్రసాద్ ప్రముఖ పుస్తక రచయిత విల్బర్ స్మిత్ రాసిన రెండు నవలల్లోని ఒకటి రెండు ఎపిసోడ్‌లు మరియు పాత్రలను ప్రేరణగా తీసుకుని కథని సిద్ధం చేసారట. ప్రస్తుతం ఫుల్ వర్షన్ స్క్రిప్ట్ వర్క్ అత్యంత వేగంగా జరుగుతోందట.
అలానే ఇది దేనికీ అనుసరణ కాదని పూర్తిగా ఒరిజినల్ యాక్షన్ అడ్వెంచర్ కథని చెప్తున్నారు. ఇక వీలైనంత త్వరలో దీనిని ప్రారంభించేందుకు జక్కన్న అండ్ టీమ్ ప్రయత్నిస్తుండగా ఇండియా తోపాటు హాలీవుడ్ కి చెందిన పలువురు నటులు కూడా ఇందులో భాగం కానున్నట్లు టాక్.