టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దిగ్గజ దర్శకుడు జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అతి త్వరలో భారీ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 రూపొందనున్న విషయం తెలిసిందే.
ఈ మూవీని భారీ స్థాయిలో అత్యధిక వ్యయంతో శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మించనుండగా ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. గ్లోబల్ గా అందరిలో ఎన్నో భారీ స్థాయి అంచనాలు ఉన్న ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుంది అనే ఆసక్తి ఎంతో నెలకొని ఉంది.
అయితే విషయం ఏమిటంటే, నేడు మాస్టర్ క్లాస్ బై మిస్టర్ విజయేంద్ర ప్రసాద్ అనే కార్యక్రమంలో భాగంగా ఆయన SSMB 29 మూవీ గురించి ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేసారు. కాగా ఆ ప్రతిష్టాత్మక మూవీ 2025 జనవరి నుండి షూటింగ్ ప్రారంభం అవుతుందని, అతి పెద్ద సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు వంటి నటుడి క్రేజ్, స్టార్డంకి మ్యాచ్ అయ్యే స్టోరీ రాయడానికి రెండేళ్లు సమయం పట్టిందని అన్నారు. త్వరలో మూవీ యొక్క ప్రారంభం గురించిన అన్ని విషయాలు టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుందని అప్పటివరకు అందరు వెయిట్ చేయండని అన్నారు విజయేంద్ర ప్రసాద్.