సూపర్ స్టార్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు రాజమౌళి ల భారీ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ SSMB 29 అనౌన్స్ మెంట్ కోసం యావత్ ప్రపంచంలోని మూవీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ భారీ క్రేజీ ప్రాజక్ట్ ని శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ గ్రాండ్ లెవెల్లో నిర్మించనుండగా వి విజయేంద్ర ప్రసాద్ కథని, ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించనున్నారు.
అందరిలో ఎంతో ఆసక్తి ఏర్పరిచిన ఈ మూవీ కోసం ఇప్పటికే పూర్తిగా బాడీ పరంగా ఫిట్ నెస్ మెయింటెయిన్ చేస్తుండడంతో పాటు గడ్డం, క్రాఫ్ కూడా పెంచుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీని రానున్న దసరా పండుగ రోజున అనగా అక్టోబర్ 12న గ్రాండ్ గా భారీ స్థాయిలో అనౌన్స్ చేయనున్నట్లు చెప్తున్నారు.
దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయని టాక్. మరోవైపు ఈ మూవీ కోసం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్నాళ్ల నుండి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎంతో వేగంగా జరుగుతుండడంతో పాటు మహేష్ బాబు పై పలు లుక్ టెస్ట్ లు కూడా నిర్వహించారట. కాగా ఈమూవీ వచ్చే ఏడాది జనవరి నుండి సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.