Homeసినిమా వార్తలుహిట్-2 చిత్ర బృందానికి మంచి సలహా ఇచ్చిన రాజమౌళి

హిట్-2 చిత్ర బృందానికి మంచి సలహా ఇచ్చిన రాజమౌళి

- Advertisement -

అడివి శేష్ హీరోగా నాని నిర్మిస్తున్న చిత్రం హిట్-2. నిన్న రాత్రి ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా జరిగింది. నిర్మాత నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని ఆహ్వానించారు. ఈ ఈవెంట్‌కి హిట్‌ మొదటి భాగంలో ప్రధాన నటుడు విశ్వక్ సేన్ కూడా హాజరయ్యారు.

రాజమౌళి తన ప్రసంగంలో హిట్ యూనివర్స్ లోని అన్ని సినిమాలను కూడా ప్రతి సంవత్సరం ఓకే నెలలో లేదా ఓకే సీజన్‌లో విడుదల చేయాలని టీమ్‌కి సలహా ఇచ్చారు. అలా చేస్తే ఆ సీజన్ మొత్తం కూడా హిట్ సినిమా సిరీస్‌కు చెందినదని ప్రేక్షకులు గుర్తించడంలో సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇది మంచి మార్కెటింగ్ ఆలోచన, వెస్ట్‌లో చూసుకుంటే అక్కడి వారు వేసవి సెలవులు, క్రిస్మస్, హాలోవీన్, థాంక్స్ గివింగ్ మొదలైన నిర్దిష్ట సినిమా సీజన్‌లను కలిగి ఉంటారు.

రాజమౌళి హిట్-2 కూడా ట్రైలర్‌ని కూడా మెచ్చుకున్నారు, ఆయన ప్రకారం నేపథ్య సంగీతం చాలా బాగుంది. ముఖ్యంగా విలన్‌ని తక్కువ అంచనా వేసిన హీరోని ఆటపట్టిస్తూ ‘అద్దం మీద కోడి బుర్ర’ అని రాసినట్లు చూపించడం వల్ల ట్రైలర్ మంచి ఇంపాక్ట్ ఇచ్చిందని అన్నారు. అలాంటి షాట్ల వలన సినిమా చూడాలనే ఆసక్తిని కలిగిందని రాజమౌళి అన్నారు.

హిట్ 2 చిత్రాన్ని నాని హోమ్ బ్యానర్ వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి నాని నిర్మించారు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

READ  ఓటిటిలో కాంతార సినిమా చూసి నిరాశపడ్డ ప్రేక్షకులు

అడివి శేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించగా.. భాను చందర్, కోమలి ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories