Homeసినిమా వార్తలుSreeleela: నేను నందమూరి బాలకృష్ణకు వీరాభిమానిని అంటున్న తాజా సంచలన నటి శ్రీలీల

Sreeleela: నేను నందమూరి బాలకృష్ణకు వీరాభిమానిని అంటున్న తాజా సంచలన నటి శ్రీలీల

- Advertisement -

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ సెన్సేషనల్ నటి శ్రీలీల. ప్రస్తుతం పెద్ద హీరోల నుంచి యువ హీరోల వరకు అందరితో నటిస్తూ ఆమె మంచి జోరుమీద ఉన్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను నందమూరి బాలకృష్ణకు వీరాభిమానిని అని తెలిపారు. NBK108 సినిమాలో నందమూరి బాలకృష్ణతో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీకి వచ్చారు శ్రీలీల. అనతికాలంలోనే విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకొని అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ముందు వరుసలో చేరిపోయారు. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల “ధమాకా” చిత్రంలో తన నటన మరియు నృత్యంతో అందరినీ మంత్రముగ్దులను చేసిన ఈ యువ నటి ఒక ఇంటర్వ్యూలో తన బిజీ షెడ్యూల్ గురించి మాట్లాడారు. తాను చాలా సంతోషంగా ఉన్నానని, చాలా శ్రద్ధతో ప్రతిదీ చేస్తానని శ్రీలీల చెప్పారు.

నేను ఎప్పుడూ ప్రజల చుట్టూ ఉండటాన్ని ఇష్టపడతాను. అదృష్టవశాత్తూ ఈ రంగంలోకి వచ్చాను. నేను మొదటి నుంచి బాలకృష్ణకు వీరాభిమానిని. ఆయనతో నటించడం మొదలుపెట్టాక మరింత పెద్ద అభిమానిని అయ్యాను. అంత గొప్ప వ్యక్తిత్వం ఆయనది. ఆయనతో సన్నివేశాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. డైలాగ్‌లో ఎలాంటి పొరపాట్లు రాకుండా జాగ్రత్తపడుతున్నాను. ఈ సినిమాలో నా పాత్ర గురించి తెలుసుకోవాలని అందరూ చాలా ఆసక్తిగా ఉన్నారు. నా పాత్ర గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు” అని అన్నారు శ్రీ లీల.

READ  Sreeleela: తెలుగు చిత్రసీమలో శ్రీలీల డేట్స్‌కు భారీ డిమాండ్

అలాగే, తన రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి చెబుతూ. ”ప్రస్తుతం నేను చాలా కొత్త ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నాను. అందులో మహేష్ బాబు, త్రివిక్రమ్ ల సినిమా ఒకటి. ఈ సినిమా కోసం నిజంగానే ఎదురుచూస్తున్నాను. రామ్ పోతినేని, నవీన్ పొలిశెట్టి, వైష్ణవ్ తేజ్ సినిమాలకు కూడా సైన్ చేశాను’’ అని తెలిపారు. ఈ యువ నటి ఇలాగే వరుస సినిమాలతో తనదైన ఉత్సాహంతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నాం.

Follow on Google News Follow on Whatsapp

READ  Suriya 42: మొత్తం సినిమా బడ్జెట్ కంటే ఎక్కువగా ఉండనున్న సూర్య 42 ప్రమోషనల్ బడ్జెట్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories