Homeసినిమా వార్తలు'ది లైఫ్ ఆఫ్ ముత్తు' విడుదలకు కారణం 'స్రవంతి' రవికిశోర్ గారే అంటున్న గౌతమ్...

‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ విడుదలకు కారణం ‘స్రవంతి’ రవికిశోర్ గారే అంటున్న గౌతమ్ మీనన్

- Advertisement -

తమిళ స్టార్ హీరో శింబు కథానాయకుడిగా, అభిరుచి గల దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా ‘వెందు తనిందదు కాడు’. ఈ చిత్రంలో సిద్దీ ఇధ్నానీ కథానాయికగా నటించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. తమిళంలో గురువారం విడుదలై అద్భుతమైన టాక్ ను, మరియు విమర్శకుల నుండి గొప్ప ప్రశంసలను అందుకుంది ఈ చిత్రం.

కాగా ఈ చిత్రాన్ని ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు ప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ విడుదల చేశారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ చిత్రం మార్నింగ్ షోలు సరైన సమయానికి మొదలవలేదు. ఐతే మ్యాట్నీ షో నుండి సినిమా చూసిన అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో తెలుగు మీడియాతో చిత్ర బృందం ముచ్చటించింది.

దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ ”నిజానికి మొదట్లో ఈ సినిమాను తెలుగులో విడుదల చేయాలనే ఆలోచన నాకు లేదు. కానీ ‘స్రవంతి’ రవికిశోర్ గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు. ‘ పాటలు విన్నాను, చాలా బావున్నాయి. అలాగే ట్రైలర్ చూశాను. నాకు బాగా నచ్చింది. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేద్దాం’ అన్నారు.

READ  నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా సక్సెస్ అవడం పక్కా - కిరణ్ అబ్బవరం

తమిళనాడులో ఒక పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా కథ మొదలవుతుంది. మరి తెలుగులో విడుదల చేయాలనుకున్నప్పుడు ఏ ఊరు అయితే బావుంటుంది? హీరో మాట్లాడే యాస ఎలా ఉండాలి? అన్న విషయాల పై కొంత పరిశోధన చేశాము. అంతే కాకుండా డబ్బింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నాం . ఇంతకు ముందు నా సినిమాలకు కొన్ని రివ్యూలలో ‘గౌతమ్ మీనన్ సినిమాల్లో హీరో బైక్ మీద తిరుగుతూ అమ్మాయితో పాటలు పాడుకుంటాడు’ అని రాశారు. కానీ, ఈ సినిమాలో మాత్రం అవేవీ లేవు. నేను ఇంతకు ముందు తీసిన సినిమాలకు చాలా భిన్నమైన సినిమా ఇది అని అన్నారు.

ఈ చిత్రానికి హీరో శింబు కాబట్టి… సినిమాను ఇంత సహజంగా తెరకెక్కించగలిగాను. అదే మరో హీరో అయితే స్టార్ డమ్, ఫ్యాన్స్ వంటి విషయాల వల్ల అనవసరమైన విషయాలు జోడించాల్సి వచ్చేది. కానీ శింబు అటువంటివి పట్టించుకోడు. అందువల్ల ఈ సినిమా తీయడం చాలా సులభంగా జరిగింది. ఇక తమిళంలో పేరున్న రచయిత జయమోహన్ ఈ చిత్రానికి కథ అందించారు.

తెలుగు, తమిళ ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. దీనికి సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉంది. రెండు మూడు రోజుల్లో ఆ వివరాలు వెల్లడిస్తానని గౌతమ్ మీనన్ అన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ..గౌతమ్ మీనన్ తో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని, ఇద్దరం కలిసి ఒక సినిమా చేయాలని అనుకున్నామని.. ఆ చర్చలో భాగంగానే ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ గురించి తెలిసిందని చెప్పారు. ఇంతకు ముందు వారి సంస్థ ద్వారా విడుదలైన ‘నాయకుడు’, ‘పుష్పక విమానం’ , ‘రెండు తోకల పిట్ట’, ‘రఘువరన్ బీటెక్’ వంటి సినిమాల తరహాలో ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని అన్నారు.

READ  Box-Office: దుల్కర్ సల్మాన్ కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సీతారామం

హీరోయిన్ సిద్ధీ ఇధ్నానీ మాట్లాడుతూ.. గౌతమ్ మీనన్ సినిమాలో కథానాయికగా నటించడం, ఈ రోజు ఆయన పక్కన కూర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తెలుగులో సినిమాను విడుదల చేసిన నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ గారికి థాంక్స్ కూడా చెప్పారు. ఇంతకు ముందు తెలుగులో కొన్ని సినిమాలు చేశానని.. కొంత విరామం తర్వాత ఈ సినిమాతో విజయం అందుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories