యువ నటుడు శ్రీవిష్ణు హీరోగా ఇవానా, కేతిక శర్మ హీరోయిన్స్ గా యువ దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించిన ఈ మూవీని గీత ఆర్ట్స్, కల్యా ఫిలిమ్స్ సంస్థల పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి గ్రాండ్ గా నిర్మించగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.
మొన్న శుక్రవారం మంచి అంచనాల నడుమ థియేటర్స్ లో ఆడియన్సు ముందుకి వచ్చిన ఈ మూవీ ఫిస్ట్ డే సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా శ్రీవిష్ణు కామెడీతో పాటు ఎంటర్టైనింగ్ అంశాలకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అన్ని ఏరియాల్లో బాగా కలెక్షన్ రాబడుతున్న ఈ మూవీ ఫస్ట్ డే రూ. 3 కోట్లు కలెక్ట్ చేసింది.
అనంతరం రెండవ రోజు రూ. 1. 5 కోట్లు రాబట్టింది మొత్తంగా రెండు రోజుల్లో ఈ మూవీ రూ. 4.5 కోట్లు రాబట్టి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బాగా రాబడుతోంది. అటు ఓవర్సీస్ లో కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తున్న ఈ మూవీ ఓవరాల్ గా ఫస్ట్ వీకెండ్ లోనే రూ. 15 కోట్లని దాటి కొనసాగుతోంది. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచెస్ కూడా ఆగిపోవడం ఈ మూవీకి కలసి వచ్చిన అంశం. ఇక నిన్నటితో బ్రేకీవెన్ చేరుకున్న ఈ మూవీ, నేటి నుండి లాభాల బాటలో నడుస్తుంది.